పవన్-క్రిష్ సినిమా ఫస్ట్ లుక్ వచ్చేసింది !

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ రీ-ఎంట్రీలో వరుస సినిమాలని లైన్ లో పెట్టిన సంగతి తెలిసిందే. పింక్ రిమేక్, క్రిష్, హరీష్ శంకర్ దర్శకత్వంలో పవన్ చేయబోయే సినిమాలపై అధికారిక ప్రకటనలు వచ్చేశాయి. ఇప్పటికే పింక్ రిమేక్ రెగ్యూలర్ షూటింగ్ జెడ్ స్పీడుతో జరుగుతోంది. సెట్స్ నుంచి ఇప్పటికే ఒకట్రెండు పిక్స్ లీకయ్యాయి. వాటినే ఫస్ట్ లుక్స్ గా అభిమానులు ఫీలవుతున్నారు.

క్రిష్ సినిమా కూడా ఇటీవలే మొదలైంది. ఈరోజు నుంచి రెగ్యూలర్ షూటింగ్ కూడా మొదలైంది. దానికి సంబంధించిన ఓ పిక్ కూడా బయటికొచ్చింది. ఇందులో దర్శకుడు, క్రిష్ సినిమాటోగ్రాఫర్ కనిపిస్తున్నారు. దీంతో.. పవన్-క్రిశ్ సినిమాకి సంబంధించి ఇదే ఫస్ట్ లుక్ గా భావిస్తున్నారు. పిరియాడిక్ డ్రామాగా తెరకెక్కుతోన్న ఈ సినిమాని కేవలం 90రోజుల్లోపూర్తి చేసేలా క్రిష్ ప్లాన్ చేసినట్టు తెలుస్తోంది. 

రీ ఎంట్రీతో పవన్ ప్రకటించిన మూడు సినిమాలు ఈ యేడాదిలోనే వచ్చే అవకాశాలున్నాయి.  పింక్ రిమేక్  కు యువ దర్శకుడు వేణు శ్రీరామ్ దర్శకత్వం వహిస్తున్నారు. బోనీ కపూర్ తో కలిసి దిల్ రాజు నిర్మిస్తున్నారు. మే 14న తెలుగు పింక్ ని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు సన్నాహాలు జరుగుతున్నాయ్. క్రిష్ సినిమా దసరా సమయం కల్లా రావొచ్చని చెబుతున్నారు. ఇక ఈ యేడాది చివరలో హరీష్ శంకర్ సినిమా రావొచ్చని చెబుతున్నారు.