అల.., సరిలేరు ఇండస్ట్రీ హిట్ ఎవరిదీ ?


సంక్రాంతి సినిమాలు సరిలేరు నీకెవ్వరు, అల.. వైకుంఠపురంలో రెండు బ్లాక్ బస్టర్ హిట్ అయ్యాయి. రికార్డులని బ్రేక్ చేయడంలోనూ ఈ రెండు పోటీ పడ్డాయి. ఐతే, ఈ రెండు సినిమాలు ఇండస్ట్రీ హిట్, నాన్ బాహుబలి రికార్డ్ బ్రేక్ అని ప్రకటించుకోవడం గందరగోళాన్ని సృష్టిస్తున్నాయి. ఇటీవలే నాన్ బాహుబలి రికార్డ్ బ్రేక్ చేశామంటూ అల.. చిత్రబృందం సెలబ్రేషన్స్ చేసుకుంది. ఏరియాల వారీగా కలెక్షన్స్ ప్రకటిస్తూ.. నాన్ బాహుబలి రికార్డ్ అని ప్రకటించుకున్నాయి. తాజాగా సరిలేరు చిత్రబృందం అదే చేసింది.

ఇండస్ట్రీ హిట్, నాన్ బాహుబలి రికార్డ్ బ్రేక్. తెలుగు రాష్ట్రాల్లో అత్యధిక వసూళ్లు సాధించిన సినిమా అంటూ సరిలేఋఉ 25రోజుల పోస్టర్స్ ని వదిలారు. ఈ నేపథ్యంలో అల.., సరిలేరు సినిమాల్లో ఇండస్ట్రీ హిట్ ఏది. నాన్ బాహుబలి రికార్డ్ బ్రేక్ చేసిన సినిమా ఏది అంటూ సినీ ప్రియులు తలలు పట్టుకుంటున్నారు. ఎవరికివారే ఇండస్ట్రీ హిట్ అని చెప్పుకోవడం కంటే.. వాస్తవ కలెక్షన్స్ ని ప్రేక్షకుల ముందు పెడితే.. వారే తేలుస్తారు కదా.. ? అని చెప్పుకొంటున్నారు.