మేడారంపై భాజాపా రాజకీయం

తెలంగాణలో మేడారం జాతర ఘనంగా జరుగుతున్న సంగతి తెలిసిందే. ఐతే, ఈ జాతర విషయంలో తెలంగాణ సీఎం కేసీఆర్ కి చిత్తశుద్ది లేదని విమర్శించారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్‌. మేడారం జాతీయ పండుగ విషయంలో తెలంగాణ ప్రభుత్వం కేంద్రానికి ప్రతిపాదనలు పంపలేదని విమర్శించారు.

ఇటీవల సీఏఏ ని వ్యతిరేకిస్తున్నట్టు ప్రకటన చేసిన సీఎం కేసీఆర్ ని రామమందిరం నిర్మాణంపై కూడా వైఖరిని ప్రకటించాలని డిమాండ్ చేశారు. భాజాపా నేత రఘునందన్‌పై నమోదైన రేప్‌ కేసుపై పార్టీలో అంతర్గత చర్చ నడుస్తోందని.. కేసుపై పూర్తి వివరాలు తెలుసుకున్నాక స్పందిస్తామని లక్ష్మణ్ తెలిపారు.

మరోవైపు, రేపు సీఎం కేసీఆర్, గవర్నర్ తమిళిసై సౌందర్‌ రాజన్‌ రేపు మేడారం వెళ్లనున్న్నారు. సమ్మక్క – సారలమ్మ గద్దెలను దర్శించుకోనున్నారు. గవర్నర్‌, సీఎం కేసీఆర్‌ పర్యటన నేపథ్యంలో మేడారంలో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు.