రసవత్తరంగా తొలి వన్డే

హామిల్టన్ వేదికగా భారత్-న్యూజిలాండ్ జట్ల మధ్య జరుగుతున్న తొలి వన్డే రసవత్తరంగా సాగుతోంది. మొదటి బ్యాటింగ్ చేసిన టీమిండియా 347/4 భారీ స్కోర్ చేసింది. శ్రేయస్ అయ్యర్ 103, కేఎల్ రాహుల్ 88, విరాట్ కోహ్లీ 51, మయాంక్ అగర్వాల్ 32, జాధవ్ 26, పృథ్వీ షా 20 పరుగులతో రాణించారు.

348 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన కివీస్ ధీటుగానే ఆడుతోంది. ప్రస్తుతం 28ఓవర్లు పూర్తయ్యే సరికి కివీస్ 2 వికెట్లు కోల్పోయి 164 పరుగులతో ఆటని కొనసాగిస్తోంంది. ప్రస్తుతం నికోలస్ 78, టేలర్ 33 పరుగులతో క్రీజులో ఉన్నారు.