తెలంగాణ పథకాలని ఆపాలని.. భాజాపా స్కెచ్ !

తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు యావత్ దేశాన్ని ఆకర్షిస్తున్న సంగతి తెలిసిందే. మన రైతుబంధు, రైతు భీమా, కల్యాణ లక్ష్మీ, షాదీ ముబారక్, మిషన్ భగీరథ, వృద్దాప్య పించన్లు.. తదితర సంక్షేప పథకాలు చాలా గొప్పవని ఇతర రాష్ట్ర ప్రభుత్వాలు అంటున్నాయి. వీలతే వాటిని అమలు చేసే దిశగా ప్రయత్నాలు కూడా చేస్తున్నాయి.

మరోవైపు, తెలంగాణ సంక్షేమపథకాల్లో అవినీతి జరుగుతుందని భాజాపా ఎంపీలు ఆరోపిస్తున్నారు. ఈ ఆరోపణలని తెరాస ఎంపీలు గట్టిగానే తిప్పికొడుతున్నారు. తెలంగాణ ప్రభుత్వ పథకాలను ఆపాలని బీజేపీ ఎంపీలు చూస్తున్నారని తెరాస ఎంపీ నామా నాగేశ్వరరావు విమర్శించారు. బుధవారం ఢిల్లీలో నామా మాట్లాడుతూ..  షాదీముబారక్‌, కళ్యాణలక్ష్మి పథకాలను అడ్డుకోవాలని ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. షాదీముబారక్‌, కళ్యాణలక్ష్మి పథకాల్లో అవినీతి ఉందని చెప్పి ఆపాలని కోరారన్నారు. పథకాల ద్వారా ఆధార్‌ డేటా తీసుకుంటున్నామని అసత్య ప్రచారాలు చేస్తున్నారని విమర్శించారు.