నిర్భయ దోషులకి ఉరి ఎప్పుడంటే ?

నిర్భయ దోషులకి ఈ నెల 1నే ఉరిశిక్ష అమలు చేయాల్సివుంది. ఐతే, న్యాయ పరమైన అడ్డంకులని వాడుకుని ఉరిశిక్షని వాయిదా పడేలా నిందితులు చేస్తున్నారు. తాజాగా నిర్భయ దోషుల ఉరిశిక్ష అమలుపై స్టే విధిస్తూ ట్రయల్‌ కోర్టు ఇచ్చిన తీర్పును ఢిల్లి హైకోర్టు సమర్థించింది. దోషులకు హైకోర్టు వారం రోజుల గడువు ఇచ్చింది.

దోషులు వారంలోగా తమకున్న అన్ని న్యాయపర అంశాలను పూర్తి చేసుకోవాలని హైకోర్టు ఆదేశించింది. వారం తరువాత ఉరి అమలుకు సంబంధించిన ప్రక్రియను ప్రారంభించవచ్చునని చెప్పింది. దోషులకు విడివిడిగా శిక్ష అమలు చేయడానికి వీలు లేదని స్పష్టం చేసింది. మరోవైపు, నిర్భయ దోషులకు త్వరలో ఉరిశిక్ష అమలవుతుందని కేంద్ర న్యాయశాఖ మంత్రి రవిశంకర్‌ ప్రసాద్‌ లోక్‌సభలో చెప్పారు. శిక్ష అమలు కాకుండా ఉండటానికి వారు ప్రయత్నిస్తున్నారని, అది సరికాదన్నారు.