‘దర్భార్’ వివాదం : కోర్టుని ఆశ్రయించిన మురగదాస్

దర్శకుడు ఏఆర్ మురగదాస్ మద్రాస్ హైకోర్టుని ఆశ్రయించారు. దర్భార్ డిస్ట్రిబ్యూటర్స్ నుంచి తనకి రక్షిణ కల్పించాలని పిటిషన్ లో పేర్కొన్నాడు. మురగదాస్ దర్శకత్వంలో సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన చిత్రం ‘దర్భార్’. నయనతార కథానాయిక. సంక్రాంతి కానుకగా జనవరి 9న ప్రేక్షకుల ముందుకొచ్చిన ‘దర్భార్’ సూపర్ హిట్ అని చిత్రబృందం ప్రకటించుకుంది. ఏకంగా రూ. 250కోట్లు వసూలు చేసిందని.. లాభాలు వచ్చాయని తెలిపారు. కానీ, పరిస్థితి అందుకు భిన్నంగా కనిపిస్తోంది.

దర్భార్ డిస్ట్రిబ్యూటర్స్ తమకి భారీ నష్టాలొచ్చాయని రోడ్లెక్కారు. ఇటీవల చైన్నైలోని రజనీ ఇంటికి వెళ్లిన దర్భార్ డిస్ట్రిబ్యూటర్స్ కి నిరాశే  కలిగింది. వారికి రజనీ అపార్ట్ మెంట్ దొరకలేదు. వారిని రజనీ ఇంట్లోకి వెళ్లకుండా పోలీసులు అడ్డుకున్నారు. ఈ న్యూస్ కోలీవుడ్ లో వైరల్ అయింది. ఐతే, తాజాగా దర్భార్ డిస్ట్రిబ్యూటర్స్ నుంచి తనకి రక్షణ కల్పించాలని దర్శకుడు మురగదాస్ హైకోర్టుని ఆశ్రయించడంతో పరిస్థితి ఎంత సీరియస్ గా ఉందో అర్థమవుతోంది.

‘దర్బార్’ సినిమాను కొని డిస్ట్రిబ్యూటర్లుగా తాము నష్టపోయామని, నష్టాలకు తనను బాధ్యుడిని చేస్తూ వ్యాజ్యాన్ని దాఖలు చేస్తామని డిస్ట్రిబ్యూటర్లు బెదిరిస్తున్నారని హైకోర్టులో దాఖలు చేసిన పిటిషన్‌లో మురుగదాస్ పేర్కొన్నాడు. తనకు డిస్ట్రిబ్యూటర్ల వల్ల హాని ఉందని, రక్షణ కల్పించాలని కోర్టుకు విన్నవించాడు.