సమంతలో తీరని కోరిక 

స్టార్ హీరోయిన్ సమంతలో తీరని కోరిక ఒకటుందట. అది తీర్చుకోవాలని ఉందని చెబుతోంది. ఆమె నటించిన ‘జాను’ సినిమా రేపు (ఫిబ్రవరి 7) ప్రేక్షకుల ముందుకు రానుంది. తమిళ్ హిట్ ’96’కి రిమేక్ ఇది. మాతృక దర్శకుడు ప్రేమ్ కుమార్ దర్శకత్వం వహించారు. శర్వానంద్-సమంత జంటగా నటించారు.

ఈ సినిమా ప్రమోషన్స్ లో పాల్గొన్న సమంత ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. మరో మూడేళ్ల తర్వాత సినిమాల్లో నటించకపోవచ్చన్నారు. అంటే.. మూడేళ్ల తర్వాత తల్లి కాబోతున్నానని పరోక్షంగా తెలిపింది సామ్. అంతేకాదు.. తనలో తీరని కోరికలని సామ్ బయటపెట్టింది. ఇప్పటి వరకు అన్ని సినిమాలలోను తనను మంచి అమ్మాయి గా చూపెట్టారు. తనకి మాత్రం భయంకరమైన విలన్ పాత్ర ఒకటి చేయాలనుందని తెలిపింది.

అది ఎలా ఉండాలంటే.. ? తనలోని విలన్ ని బయటపెడుతూ.. ఆడవాళ్ళు కూడ ద్వేషించే ఒక వెరైటీ నెగిటివ్ పాత్రలో చేయాలని ఉందన్నారు. ప్రస్తుతం ‘ఫ్యామిలీ మేన్2’ వెబ్ సిరీస్ లో నటిస్తున్నా. ఇందులో నెగటివ్ రోల్ చేస్తున్నా. అంతేకాదు ఫైట్స్ కూడా చేస్తా. డూబ్ లేకుండా ఫైట్స్ చేశాను. ఐతే, పూర్తి స్థాయిలో విలన్ పాత్రని చేయాలని.. ఆ పాత్రతో సినిమాలకి గుడ్ బై చెప్పాలని ఉందని సామ్ తెలిపింది. మరీ.. సామ్ కోరికని ఏ దర్శకుడు తీరుస్తాడన్నది చూడాలి.