హీరోకి చెల్లెలు పాత్రలో త్రిష
సీనియర్ హీరోయిన్స్ రీ-ఎంట్రీ తర్వాత తల్లి, అత్త, అక్కా-చెల్లి, వదిన పాత్రల్లో మెరుస్తుంటారు. ఒక్కప్పుడి స్టార్ హీరోయిన్స్ నే నేటి తల్లులు, అత్తలు కూడా. ఈ లిస్టులో స్టార్ హీరోయిన్ త్రిష కూడా చేరిపోయింది. హీరోయిన్ గా ఇప్పటికీ బిజీగా ఉన్న త్రిష అప్పుడే సోదరి పాత్ర చేయడం ఏంటీ అనుకుంటున్నారా.. ? కానీ, చేస్తున్నారు.
మణిరత్నం మల్టీస్టారర్ ‘పొన్నియిన్ సెల్వం’లో జయం రవి అరుల్‌మొళి వర్మన్ అనే పాత్రని చేస్తున్నారు. కుందవై పాత్రలో త్రిష నటిస్తోంది. కథ ప్రకారం వీరిద్దరు అన్నా చెల్లి అవుతారట. జయంరవితో ‘సంథింగ్ సంథింగ్’, ‘సకలకళావల్లవన్’, ‘భూలోకం’ చిత్రాల్లో హీరోయిన్‌గా నటించింది త్రిష. ఇప్పుడు మాత్రం ఆయనకి చెల్లెలుగా మారిపోయింది. కెరీర్ చెరమాంకంలో ఉన్న త్రిషకు చెల్లులు పాత్రలో ఓ ప్రాక్టీస్ లాంటిదని నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ఇక మెగాస్టార్-కొరటాల సినిమాలో త్రిష హీరోయిన్ గా నటిస్తున్న సంగతి తెలిసిందే.