అనుపమ క్లాసిక్ పోజు
యంగ్ హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్ సోషల్ మీడియాలో ఎప్పుడూ అభిమానులతో టచ్ లో ఉంటుంది. వారికోసం ఫ్రెష్ ఫోటోలని, కొత్త కొత్త వీడియోలని పోస్ట్ చేస్తుంటుంది. సినిమాలు ఉన్నా.. లేకున్నా అనుపమ అభిమానులతో టచ్ లోనే ఉంటుంది. తాజాగా అనుపమ క్లాసిక్ పోజులో దిగిన ఫోటోని తన ట్విట్టర్ ఖాతాలో షేర్ చేసింది.
ఇక అనుపమ ఎక్కువగా ప్రేమకథా చిత్రాల్లో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఎక్కువగా ప్రేమకథా సినిమాలు చేస్తున్నారు ఎందుకు అంటే.. ? ప్రేమకథల్లో నటించడాన్ని ఆస్వాదిస్తున్నా. ఇప్పటి వరకూ ప్రేమకథలే చేశాను. అయినా బోర్ కొట్టడం లేదు. కొన్నాళ్లకు ఎలాగూ వయసైపోతుంది. అప్పుడు బరువైన పాత్రలు వస్తాయి. ప్రేమకథల్లో చేయాలనుకున్నా అవకాశం ఉండదు. అందుకే ఇప్పుడు ఎంజాయ్ చేస్తున్నాని చెప్పుకొచ్చింది.