‘జాను’కు షాక్.. ఆన్ లైన్ లో మొత్తం సినిమా లీకు !

శర్వానంద్-సమంత జంటగా నటించిన చిత్రం ‘జాను’. తమిళ్ క్లాసిక్ ’96’కి రిమేక్ ఇది. మాతృక దర్శకుడు ప్రేమ్ కుమార్ దర్శకత్వం వహించారు. దిల్ రాజు బ్యానర్ నుంచి వచ్చిన తొలి రిమేక్ సినిమా ఇది. భారీ అంచనాల మధ్య ఈరోజు ప్రేక్షకుల ముందుకొచ్చిన జాను హిట్ టాక్ ని సొంతం చేసుకుంది. 96 మేజిక్ ని రిపీట్ చేసిందని చెబుతున్నారు.

హిట్ టాక్ తో హ్యాపీ మూడ్ లో ఉన్న జాను చిత్రబృందానికి పైరసీ రాయుళ్లు షాక్ ఇచ్చారు. జాను మొత్తం సినిమాని ఆన్ లైన్ లో లీక్ చేశారు. ఉదయం పూట ఆట పూర్తికాకముందే సినిమా లీక్ కావడంతో చిత్రబృందం షాక్ అవుతున్నారు. వెంటనే పైరసీ లింకులని డిలీట్ చేసే పని మొదలెట్టినా.. అప్పటికి చాలామంది సినిమాని డౌన్ లోడ్ చేసుకొని చూస్తున్నారు. 

ఐతే, ఇది పైరసీ ప్రింట్ లో చూడాల్సిన సినిమా కాదు. ఓ అద్భుతమైన ప్రేమకథ. దాన్ని థియేటర్స్ లో చూస్తేనే ఆస్వాదించవచ్చని ఇప్పటికే థియేటర్స్ లో సినిమాని చూసిన ప్రేక్షకులు చెబుతున్నారు.