రివ్యూ : జాను

చిత్రం : జాను (2020)

నటీనటులు : శర్వానంద్, సమంత తదితరులు

సంగీతం : గోవింద్ వసంత

దర్శకత్వం : ప్రేమ్ కుమార్

నిర్మాత : దిల్ రాజు

రిలీజ్ డేటు : 07 ఫిబ్రవరి, 2020

రేటింగ్ : 3.5/5

శర్వానంద్-సమంత జంటగా నటించిన చిత్రం ‘జాను’. తమిళ్ క్లాసిక్ ’96’కి రిమేక్ ఇది. మాతృక దర్శకుడు ప్రేమ్ కుమార్ దర్శకత్వం వహించారు. దిల్ రాజు బ్యానర్ లో తెరకెక్కిన తొలి రిమేక్ సినిమా ఇది. టీజర్, ట్రైలర్ తో 96 రిమేక్ ని రిపీట్ చేసేలా ‘జాను’ కనిపించింది. మరీ.. ఆ విషయంలో జాను ఏ మేరకు విజయవంతం అయిందనేది తెలుసుకునేందుకు రివ్యూలోకి వెళదాం పదండీ.. !

కథ :

కె.రామచంద్ర అలియాస్ రామ్ (శర్వానంద్) ట్రావెల్ ఫొటోగ్రాఫర్. అతను వృత్తిలో భాగంగా తను పుట్టి, పెరిగిన విశాఖపట్నం వెళ తాడు. తన స్కూల్ ని మరోసారి చూసి పాత జ్ఞాపకాల్ని నెమరేసుకుంటాడు. అప్పుడే తన స్నేహితులంతా కలిసి పూర్వ విద్యార్థుల సమ్మేళనం ఏర్పాటు చేయాలని నిర్ణయించుకుంటారు. అలా వారందరూ హైదరాబాద్ లో కలుసుకుంటారు.

ఆ కార్యక్రమానికి జానకిదేవి అలియాస్ జాను(సమంత) కూడా సింగపూర్ నుంచి వస్తుంది. రామ్, జాను పదో తరగతిలోనే ప్రేమలో పడతారు. కానీ, అనుకోకుండా విడిపోతారు. మళ్లీ కలవరు. దాదాపు 17 యేళ్ల తర్వాత కలిసిన వాళ్లిద్దరూ తమ తొలిప్రేమ గురించి ఏం మాట్లాడుకున్నారు ? అన్నేళ్ల తర్వాత వాళ్ల జీవితాల్లో వచ్చిన మార్పులు ఎలాంటివి ? తదితర విషయాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే.

ప్లస్ పాయింట్స్ :

* కథ-కథనం

* శర్వానంద్, సమంతల నటన

* నేపథ్య సంగీతం

* భాగోద్వేగాలు

మైనస్ పాయింట్స్ :

* స్లో నేరేషన్

* 96తో పోలిక

నటీనటుల ఫర్ ఫామెన్స్ :

ప్రేమకథలు ఎక్కువగా యువతకి నచ్చుతాయి. వారిని టార్గెట్ చేసుకొనే ప్రేమకథా సినిమాలు తెరకెక్కిస్తుంటారు. కొన్ని ప్రేమ కథలు మాత్రం వయసుతో సంబంధం లేకుండా అందరికీ చేరువయ్యేలా ఉంటాయి. అలాంటి ప్రేమకథే.. జాను. తొలి ప్రేమ చేసిన తీపి గాయాలతో హృదయాల్ని బరువెక్కిస్తూ ముందుకు సాగుతుందీ చిత్రం. రామ్ తన స్కూల్ లోకి అడుగు పెట్టినప్పట్నుంచే సినిమా భావోద్వేగ భరితంగా మారిపోతుంది. తొలిభాగం సరదా సరదాగా సాగినా.. ఇంటర్వెల్ ఏపీసోడ్ భాగోద్వేగానికి గురి చేస్తుంది.

ఇక ద్వితీయార్థాని మరింత ఎమోషనల్ గా నడిపాడు దర్శకుడు. రామ్, జాను కలిసి ఒక రోజు రాత్రి చేసే ప్రయాణం.. అక్కడ జాను గురించి రామ్ తెలుసుకున్న విషయాల గురించి చెప్పడం, రామ్ స్టూడెంట్స్ దగ్గర జాను చెప్పిన ప్రేమకథ, ఆ నేపథ్యంలో భావోద్వేగాలు మనసుల్ని హత్తుకుంటాయి. శర్వానంద్, సమంత పాత్రలకి ప్రాణం పోశారు. వీరిద్దరి మధ్యే ఎక్కువ సీన్లు ఉంటాయ్. ద్వితీయార్థం సినిమా దాదాపు వీరి మధ్యే నడుస్తోంది. కానీ, ఎక్కడ బోర్ కొట్టదు.

సాంకేతికంగా :

గోవింద్ వసంత సంగీతం బాగుంది. నేపథ్య సంగీతం సినిమాకి మంచి ఫీల్ ని తీసుకొచ్చింది. మహేంద్రన్ జైరాజ్ సినిమాటోగ్రఫీ బాగుంది. మిర్చికిరణ్ మాటలు మెప్పిస్తాయి. ప్రేమ్ కుమార్ భావోద్వేగాలపై పట్టు కోల్పోకుండా కథని నడిపించిన విధానం మెప్పిస్తుంది. నిర్మాణ విలువలు బాగున్నాయి.