‘జాను’లో నాగ చైతన్య స్పెషల్


‘జాను’గా ప్రేక్షకుల ముందుకొచ్చింది సమంత. శర్వానంద్-సమంత జంటగా నటించిన చిత్రం ‘జాను’. తమిళ్ హిట్ ’96’కి రిమేక్ ఇది. మాతృక దర్శకుడు ప్రేమ్ కుమార్ దర్శకత్వం వహించారు. దిల్ రాజు నిర్మించారు. భారీ అంచనాల మధ్య జాను ఈరోజు ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఇప్పటికే ఉదయం పూట పడిపోయింది. పబ్లిక్ టాక్ బయటికొచ్చింది. హిట్ టాక్ సొంతం చేసుకుంది.

అంతేకాదు.. ‘జాను’ ప్రమోషన్స్ లో నాగ చైతన్య, అక్కినేని ఫ్యామిలీ హిట్ అయింది. జాను థియేటర్స్ ముందు నాగ చైతన్య-సమంత బ్యానర్స్, కటౌట్స్ తో పాటు అక్కినేని ఫ్యామిలీ పోస్టర్స్ వెలిశాయి. జాను రిలీజ్ ని అక్కినేని అభిమానులు ఎంజాయ్ చేస్తున్నారు. ఇక జాను సినిమా అద్భుతంగా ఉందనే టాక్ వినిపిస్తోంది. ఈ సినిమాని కమర్షియల్ గా చూడలేం. సమంత అభిమానులకి జాను ఓ జ్ఝాపకం. జానుగా సామ్ నటన అద్బుతం అంతున్నారు.