ప్రభాస్ ప్రేమకథా టైటిల్ ఫిక్స్


యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రేక్షకులకి తన ప్రేమకథని చెప్పబోతున్న సంగతి తెలిసిందే. రాథాకృష్ణ దర్శకత్వంలో ప్రభాస్-పూజా హెగ్డే జంటగా ఓ ప్రేమకథ చిత్రం తెరకెక్కుతోంది. పునర్జన్మల నేపథ్యంలో ఆసక్తికర కథనంతో ఈ ప్రేమకథ సాగుతుందట. ఈ సినిమా కోసం ‘జాన్’ అనే వర్కింగ్ టైటిల్ ప్రచారంలో ఉంది. ఐతే, ఈ టైటిల్ ని సమంత-శర్వా దొంగలించారు. వీరిద్దరు జంటగా నటించిన 96 తెలుగు రిమేక్ ‘జాను’ టైటిల్ తో ప్రేక్షకుల ముందుకొచ్చిన సంగతి తెలిసిందే.

ఈ నేపథ్యంలో ప్రభాస్ ప్రేమకథా చిత్రం టైటిల్ ఏమై ఉంటుందనే ఆసక్తి నెలకొంది. తాజా సమాచారమ్ ప్రకారం ప్రభాస్ ప్రేమకథకి ‘ఓ డియర్’ టైటిల్ ని ఫిక్స్ చేసినట్టు తెలుస్తోంది. ఈ టైటిల్ ను యూవీ క్రియేషన్స్ ఫిల్మ్ ఛాంబర్లో రిజస్టర్ కూడా చేయించింది. ఐతే,దీనిపై చిత్రబృందం నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ఇక ప్రభాస్ తన ప్రేమకథని ఎప్పుడు చూపిస్తాడన్నది తెలియాల్సి ఉంది.