దిల్ రాజు చేతికి ‘ఆర్ఆర్ఆర్’ నిజాం రైట్స్.. రేటెంతో తెలుసా ?

తెలుగు సినిమాని శిఖర్ అంచున నిలబెట్టిన సినిమా ‘బాహుబలి’. ఈ సినిమా తర్వాత రాజమౌళి తెరకెక్కిస్తోన్న చిత్రం ‘ఆర్ఆర్ఆర్’పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలున్నాయి. అందుకు తగ్గట్టుగానే ప్రీ-రిలీజ్ బిజినెస్ జరుగుతోంది. ఆర్ఆర్ఆర్ రైట్స్ తగ్గించుకోవడానికి భారీగా ఆఫర్ చేస్తున్నారు. నిజాం హక్కుల కోసం నిర్మాత దిల్ రాజు ఏకంగా రూ. 75కోట్లు ఆఫర్ చేశాడట. నిజాంలో ఇప్పటివరకు 70కోట్లు వసూలు చేసిన సినిమాయే లేదు. బాహుబలి కలెక్షన్స్ నే నిజాంలో టాప్.

మరీ ఏ దైర్యంతో దిల్ రాజు ఇంతటి భారీ రేటుకి అడగాడు అంటే.. ఆర్ ఆర్ ఆర్ పై ప్రేక్షకుల్లో ఉన్న అంచనాలు అలాంటివని చెబుతున్నారు. ఇంకా డీల్ ఓకే కాలేదు. ప్రసుత్తం చర్చలు జరుగుతున్నాయి. నిజాంలో మంచి పట్టున్న దిల్ రాజు చేతిలో ఆర్ ఆర్ ఆర్ పడుతుందేమో చూడాలి.

ఎన్టీఆర్‌, రామ్‌ చరణ్‌ కథానాయకులుగా ఆర్ఆర్ఆర్ తెరకెక్కుతోంది. ఈ చిత్రంలో రామ్‌చరణ్‌.. అల్లూరి సీతారామరాజుగా, ఆయనకి జంటగా బాలీవుడ్ బ్యూటీ అలియా భట్ నటిస్తున్నారు. ఎన్టీఆర్‌.. కొమరంభీంగా, ఆయనకి జోడిగా హాలీవుడ్‌ నటి ఒలీవియా మోరీస్‌ సందడి చేయనున్నారు.  ఈ సినిమాలో బాలీవుడ్‌, హాలీవుడ్‌కు చెందిన తారలు సందడి చేయనున్నారు. వచ్చే ఏడాది జనవరి 8 ఆర్ ఆర్ ఆర్ ప్రేక్షకుల ముందుకు రానుంది.