‘వరల్డ్ ఫేమస్ లవ్వర్’ ట్రైలర్ టాక్ – అర్జున్ రెడ్డికి నాలుగు రెట్లు

టాలీవుడ్ సంచలనం విజయ్ దేవరకొండ తాజా చిత్రం ‘వరల్డ్ ఫేమస్ లవ్వర్’. క్రాంతి మాధవ్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రమిది. రాశీ ఖన్నా, ఐశ్వర్యా రాజేష్‌, కేథరిన్‌ థ్రెస్సా, ఇసాబెల్లాలు హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ రొమాంటిక్ ఎంటర్ టైనర్ ప్రేమికుల దినోత్సవం కానుకగా ఫిబ్రవరి 14న ప్రేక్షకుల ముందుకు రానుంది.

గురువారం ఈ సినిమా ట్రైలర్ ని విడుదల చేశారు. “ఈ ప్రపంచంలో నిస్వార్థమైనది ఏదైనా ఉందంటే.. అది ప్రేమ ఒక్కటే. ఆ ప్రేమలో కూడా నేను అనే రెండు అక్షరాలు ఓ సునామీనే లేపగలవు” అనే డైలాగ్ తో ట్రైలర్ మొదలైంది. నలుగురి హీరోయిన్స్ తో విజయ్ ప్రేమకథ, దానికి సంబంధించిన బోల్డ్ యాక్టింగ్, డైలాగ్స్ అదిరిపోయాయ్. సింపుల్ గా చెప్పాలంటే.. వరల్డ్ ఫేమస్ లవ్వర్ అర్జున్ రెడ్డి సినిమాకి నాలుగు రెట్లుగా అనిపించింది. ఆ ట్రైలర్ ని మీరు చూసేయండీ.. !