రేప్ నుంచి తప్పించిన కరోనా వైరస్
ఇప్పుడు కరోనా వైరస్ పేరు చెబుతేనే వణుకు వచ్చేస్తోంది. ఈ వైరస్ సోకిన వారు బతుకుపై ఆశలు వదులుకోవాల్సిందే. ఐతే, ఈ ప్రాణాంతక వైరస్ పేరు చెప్పి ఓ మహిళా అత్యాచారం నుంచి తప్పించుకున్న ఘటన చైనాలోని జింగ్ షాన్ పట్టణంలో చోటు చేసుకుంది. చైనాలోని ఓ మహిళ.. ఇటీవలే వుహాన్ పట్టణం నుంచి జింగ్‌షాన్‌కు వచ్చి నివాసం ఉంటుంది.
ఇటీవల.. ఓ దొంగ ఆమె ఇంట్లోకి చొరబడ్డాడు. ఒంటరిగా ఉన్నది గమనించి.. ఆమెపై అత్యాచారానికి పాల్పడేందుకు ప్రయత్నించాడు. దీంతో వెంటనే అప్రమత్తమైన సదరు మహిళ.. తనకు కరోనా సొకిందంటూ అరిచింది. దగ్గుతూ మాట్లాడింది. వూహాన్ నుంచి వచ్చాను. వైరస్ సోకడంతో ఒంటరిగా ఉంటానని చెప్పింది. దాంతో.. భయపడిపోయిన ఆ దొంగ అక్కడి నుంచి పారిపోయాడు. కానీ, డబ్బుమాత్రం దొచుకెళ్లాడు. డబ్బుపోయినా.. మానాన్ని మాత్రం కరోనా వైరస్ కాపాడింది.
ఈ ఘటనపై సదరు మహిళా పోలీసులకి ఫిర్యాదు చేసింది. రంగంలోకి దిగిన పోలీసులు ఆ దొంగని అరెస్ట్ చేశారు. దొంచుకున్న సొమ్ముని రికవరీ చేసి.. సదరు మహిళకి అందజేశారు.