ఎగ్జిట్ పోల్స్  : ఢిల్లీ పీఠం మరోసారి సామాన్యుడిదే


దేశ రాజధాని ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. ఈ ఎన్నికల్లో ఇప్పటి వరకు అందిన సమాచారం ప్రకారం 57.9 శాతం పోలింగ్ నమోదైంది. మొత్తం 70 నియోజకవర్గాల్లో 672 మంది అభ్యర్థుల భవితవ్యాన్ని ఢిల్లీ ఓటర్లు ఈవీఎంలలో నిక్షిప్తం చేశారు. ఐతే, పోలింగ్ ముగిసిన కొద్దిసేపటికే ఎగ్జిట్ పోల్స్ క్యూ కట్టాయి. దేశంలోని ప్రముఖ జాతీయ టీవీ ఛానళ్లు, సంస్థలు నిర్వహించిన సర్వేల్లోనూ మళ్లీ ఢిలీ పీఠం సామాన్యుడిదేనని తేలింది.

దేశవ్యాప్తంగా అందరి దృష్టినీ ఆకర్షించిన ఈ ఎన్నికల్లో మళ్లీ సామాన్యుడి (ఆమ్ ఆద్మీ) పార్టీయే దిల్లీ పీఠం దక్కించుకుంటుందని సర్వేలు తేల్చాయి. అసెంబ్లీలో ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన స్థానాల కంటే ఎక్కువే గెలిచి ఆప్ మరోసారి అధికారంలోకి వస్తుందని పేర్కొన్నాయి. ఈ నెల 11న ఎన్నికల ఫలితాలు వెల్లడికానున్నాయి. మరీ ఎగ్జిట్ పోల్స్ నే రియల్ రిజల్ట్ అవుతుందేమో చూడాలి.

ఇండియా టుడే ఎగ్జిట్ పోల్స్ :

ఆమ్ ఆద్మీ : 44

భాజాపా : 26

కాంగ్రెస్ : 0

ఇతరులు : 0

న్యూస్ ఎక్స్ :

ఆమ్ ఆద్మీ : 53-57

భాజాపా : 11-17

కాంగ్రెస్ : 0-2

ఇతరులు : 0

టైమ్స్ నౌ :

ఆమ్ ఆద్మీ : 44

భాజాపా : 26

కాంగ్రెస్ : 0

ఇతరులు : 0

రిబ్లిక్ టీవీ :

ఆమ్ ఆద్మీ : 48-61

భాజాపా : 9-21

కాంగ్రెస్ : 0-1

ఇతరులు : 0

న్యూస్ 18 :

ఆమ్ ఆద్మీ : 44

భాజాపా : 26

కాంగ్రెస్ : 0

ఇతరులు : 0