కష్టాల్లో భారత్ 71/4 (13.2 ఓవర్లు)

274 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియా కష్టాల్లో పడింది. 71 పరుగులకే కీలక నాలుగు వికెట్లు కోల్పోయింది. ఓపెనర్లు పృధ్వీ షా 24, మయాంక్ అగర్వాల్ 3 పరుగులకే పెలివియన్ చేశారు. కెప్టెన్ కోహ్లీ 15 పరుగుల వద్ద అవుట్ అయ్యాడు. సూపర్ ఫామ్ లో ఉన్న కెల్ రాహుల్ 4 పరుగులకే అవుటయ్యాడు. 15 ఓవర్లు పూర్తయ్యేసరికి 4 వికెట్లు కోల్పోయిన టీమిండియా 76 పరుగులు చేసింది.  శ్రేయస్ అయ్యర్ 26, జాదవ్ 0 పరుగులతో క్రీజులో ఉన్నారు.

అంతకుముందు టాస్ ఓడి మొదటి బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 273 పరుగులు చేసింది. సూపర్ ఫామ్ లో ఉన్న టేలర్ 73 పరుగులతో నాటౌట్ గా నిలిచాడు. నికోల్స్ (41),  గుప్టిల్ (79 పరుగులు, 8 ఫోర్లు, 3 సిక్సర్లు) రాణించారు. టీమిండియా బౌలర్లలో చాహల్ 3, శార్దూల్ ఠాకూర్ 2, జడేజా ఒక్క వికెట్ తీశారు.