‘అసురన్’ దర్శకుడితో తారక్ సినిమా.. ఫిక్స్ !

గత యేడాది ప్రేక్షకుల ముందుకొచ్చిన తమిళ చిత్రం ‘అసురన్’ బ్లాక్ బస్టర్ హిట్ అయింది. జాతీయ అవార్డ్ విజేత వెట్రిమారన్ దర్శకత్వంలో ధనుష్ నటించిన సినిమా ఇది. ఇప్పుడీ సినిమాని ‘నారప్ప’గా తీసుకొస్తున్న విక్టరీ వెంకటేష్. ఇక అసురన్ దర్శకుడు వెట్రిమారన్ దర్శకత్వంలో ఓ సినిమా చేసేందుకు యంగ్ టైగర్ ఎన్టీఆర్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు సమాచారమ్.

ప్రస్తుతం తారక్ ‘ఆర్ఆర్ఆర్’ సినిమాతో బిజీగా ఉన్నాడు. వచ్చే యేడాది జనవరి 8న ఆర్ ఆర్ ఆర్ ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా తర్వాత త్రివిక్రమ్ దర్శకత్వంలో తారక్ సినిమా ఉండనుంది. పాన్ ఇండియా సినిమాగా ఇది తెరకెక్కనుందనే ప్రచారం జరుగుతోంది. ఈ సినిమా తర్వాత అసురన్ దర్శకత్వంలో తారక్ సినిమా ఉండనుందని సమాచారమ్.