వన్డే సిరీస్ కివీస్ దే !

రెండో వన్డేలోనూ టీమిండియా ఓటమి పాలైంది. శనివారం ఆక్లాండ్‌ వేదికగా జరిగిన రెండో వన్డే లో కివీస్ 26 పరుగుల తేడా విజయం సాధించింది. టాస్ ఓడి మొదటి బ్యాటింగ్ చేసిన కివీస్ నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 273 పరుగులు చేసింది. సూపర్ ఫామ్ లో ఉన్న టేలర్ 73 పరుగులతో నాటౌట్ గా నిలిచాడు. నికోల్స్ (41),  గుప్టిల్ (79 పరుగులు, 8 ఫోర్లు, 3 సిక్సర్లు) రాణించారు. టీమిండియా బౌలర్లలో చాహల్ 3, శార్దూల్ ఠాకూర్ 2, జడేజా ఒక్క వికెట్ తీశారు.

274 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియాకి ఆదిలోనే గట్టి దెబ్బ తగిలింది. 71 పరుగులకే కీలక నాలుగు వికెట్లు కోల్పోయింది. ఓపెనర్లు పృధ్వీ షా 24, మయాంక్ అగర్వాల్ 3 పరుగులకే పెలివియన్ చేశారు. కెప్టెన్ కోహ్లీ 15 పరుగుల వద్ద అవుట్ అయ్యాడు. సూపర్ ఫామ్ లో ఉన్న కెల్ రాహుల్ 4 పరుగులకే అవుటయ్యాడు. శ్రేయస్ అయ్యర్ 52, జడేజా 55, నవదీప్ సైనీ 45 రాణించినా ఫలితం లేకపోయింది. టీమ్ ఇండియా 48.3 ఓవర్లలో  2510 పరుగులకే ఆలవుటయింది. దీంతో మూడు వన్ డే ల సిరీస్ ని మరో వన్డే మిగిలి ఉండగానే గెలిచేసింది.