తమన్నా ‘సీటీమార్’ లుక్.. అదిరింది !

మిల్కీబ్యూటీ తమన్నా పొగరు చూపిస్తోంది. సంపత్ నంది దర్శకత్వంలో గోపీచంద్-తమన్నా జంటగా నటిస్తున్న చిత్రం ‘సీటీమార్’. దిగంగన సూర్యవంశీ మరో కథానాయికగా నటిస్తోంది. తాజాగా ఈ సినిమా నుంచి తమన్నా ఫస్ట్ లుక్ ని విడుదల చేశారు. ఈ సినిమాలో ఆమె జ్వాలారెడ్డిగా కనిపించబోతున్నట్టు ఫస్ట్ లుక్ పోస్టర్ లో తెలిపారు. ఈ పోస్టర్ లో తమన్నా రెడ్ది పొగరు చూపిస్తోంది. దాని వెనక ఉన్న అసలు కథేంటన్నది సినిమా చూసి తెలుసుకోవాల్సిందే.

ఈ సినిమాలో గోపీచంద్ కూడా కబడ్డీ కోచ్ గా కనిపించబోతున్నారు. ఆయన ఆంధ్రా కబడ్డీ టీమ్ కోచ్‌గా కనిపిస్తారట. ఇక, తెలంగాణా కబడ్డీ టీమ్ కోచ్‌గా తమన్నా కనిపించనున్నారని సమాచారమ్. ఇద్దరు కోచ్ ల మధ్య ప్రేమ ఎలా పుట్టిందన్నది సీటీ మార్ లో చూడాలి. ఈ చిత్రంలో భూమిక, రావు రమేష్ కీలక పాత్రలు పోషిస్తున్నారు.