విజయ్ ఇంట్లో ముగిసిన ఐటీ సోదాలు.. ఎంత డబ్బు పట్టుబడిందంటే ?
కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ ఇంట్లో గత రెండ్రోజులుగా ఐటీ సోదాలు జరిగిన సంగతి తెలిసిందే. విజయ్ నివాసంతో పాటు.. ‘బిగిల్’ చిత్ర ప్రముఖుల ఇళ్లు, కార్యాలయాలలో ఆదాయపు పన్ను శాఖ అధికారుల సోదాలు చేశారు. శనివారం రాత్రితో ఈ సోదాలు ముగిశాయి. అన్బుచెళియన్ వద్ద లెక్కచూపని కరెన్సీ రూ.77 కోట్లను స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు తెలిపారు. ఏజీఎస్, అన్బుచెళియన్ నివాసాల్లో అధిక సంఖ్యలో దస్త్రాలు స్వాధీనం చేసుకున్నారు. వాటిని పరిశీలించిన అనంతరం తదుపరి దర్యాప్తు నిర్వహించనున్నట్లు అధికారులు పేర్కొంటున్నారు.
నైవేలిలో ‘మాస్టర్’ సినిమా షూటింగ్ స్పాట్ నుంచి విజయ్‌ను చెన్నైలోని పణయూర్‌లో ఉన్న ఆయన నివాసానికి తీసుకొచ్చిన మరీ విచారించారు. ఆయన నివాసాల్లో సోదాలు గురువారంతో ముగిశాయి. ఏజీఎస్ సంస్థ, అన్బుచెళియన్ నివాసాలు, కార్యాలయాల్లో సోదాలు మాత్రం శనివారం వరకు కొనసాగాయి. ఇక విజయ్ ఇంట్లో సోదాల నేపథ్యంలో చెన్నైలో విజయ్ వర్సెస్ భాజాపా లా మారింది. విజయ్ ని కావాలనే భాజాప టార్గెట్ చేసిందని అభిమానులు ఆరోపించారు. నిరసనలు కూడా తెలిపారు.