కేటీఆర్ తొలి ఇంటర్నేషనల్ డ్రైవింగ్ లైసెన్స్.. చూశారా ?
టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ సోషల్ మీడియాలో యాక్టివ్ ఉంటారన్న సంగతి తెలిసిందే. సోషల్ మీడియా ద్వారా వచ్చే వినతులపై ఆయన స్పందిస్తారు. వాటి పరిష్కారించేందుకు ప్రయత్నిస్తారు కూడా. ప్రభుత్వ, పార్టీ అంశాలే కాదు.. పర్సనల్ విషయాలని సోషల్ మీడియా ద్వారా పంచుకుంటారు కేటీఆర్.
తాజాగా తన మొట్టమొదటి ఇంటర్నేషనల్ డ్రైవింగ్ లైసెన్స్ ను ట్విట్టర్ లో పోస్టు చేశారు. “1998లో జారీ అయినా నా తొలి ఇంటర్నేషనల్ లైసెన్స్ దొరికింది… ఇదిగో చూడండి” అంటూ ట్వీట్ చేశారు.
ఆ లైసెన్స్ ను అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం రవాణా విభాగం జారీ చేసింది. అందులో తన పేరును కల్వకుంట్ల తారక రామారావుగా పేర్కొన్న కేటీఆర్, తండ్రి పేరును, జన్మస్థలాన్ని, పుట్టినతేదీని కూడా పేర్కొన్నారు. 1976 జూలై 24న సిద్ధిపేటలో ఆయన జన్మించినట్టు ఆ లైసెన్స్ కార్డులో చూడొచ్చు.
Found my first international licence issued in 1998 (previous millennium 😀) #Throwback pic.twitter.com/wkbIF9wLFU
— KTR (@KTRTRS) February 9, 2020