జీహెచ్‌ఎంసీలో సీఏఏకు వ్యతిరేకంగా తీర్మానం.. ఎంఐఎం కోసమే !

సీఏఏకు వ్యతిరేకంగా దేశ వ్యాప్తంగా ఆందోళనలు కొనసాగుతున్న సంగతి తెలిసిందే. సీఏఏని వ్యతిరేకించిన రాష్ట్ర ప్రభుత్వాల్లో తెలంగాణ ప్రభుత్వం కూడా చేరిపోయింది. తెలంగాణలో సీఏఏని అమలు చేయబోమని స్వయంగా సీఎం కేసీఆర్ ప్రకటన చేసిన చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంనే శనివారం జీహెచ్‌ఎంసీలో సీఏఏకు వ్యతిరేకంగా తీర్మానం చేశారు.

దీనిపై తెలంగాణ భాజాపా నేతలు మండిపడుతున్నారు. ఎంఐఎం కోసమే జీహెచ్‌ఎంసీలో సీఏఏకు వ్యతిరేకంగా తీర్మానం చేశని తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్‌ ఆరోపించారు. ఓటు బ్యాంకు రాజకీయాలకు పాల్పడేవారికి కనువిప్పు కలగాలన్నారు.