తెలుగు ‘పింక్’ ఫస్ట్ లుక్ ఎప్పుడంటే ?


పింక్ రిమేక్ తో పవర్ స్టార్ పవన్ కల్యాణ్ రీ-ఎంట్రీ ఇస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రానికి యువ దర్శకుడు వేణు శ్రీరామ్ దర్శకత్వం వహిస్తున్నారు. బోనీ కపూర్ తో కలిసి దిల్ రాజు నిర్మిస్తున్నారు. పింక్ రిలీజ్ మే నెలలో ఉంటుందని ఇప్పటికే దిల్ రాజు తెలిపిన సంగతి తెలిసిందే. మే నెలలో వచ్చిన ‘గబ్బర్ సింగ్’ బ్లాక్ బస్టర్ హిట్ అయింది. ఆ సెంటిమెంట్ లోనే పింక్ సినిమాని అదే నెలలో తీసుకురావాలనే ప్రయత్నంలో దిల్ రాజు ఉన్నారు.

ఆదివారం ‘జాను’ చిత్రబృందం తిరుమల శ్రీనివారిని దర్శించుకుంది. వీఐపీ ప్రారంభ దర్శన సమయంలో నటి సమంతా, హీరో శర్వానంద్‌, నిర్మాత దిల్‌ రాజు స్వామివారి సేవలో పాల్గొన్నారు. ‘జాను’ చిత్రం విజయం సాధించడం సంతోషంగా ఉందని, స్వామివారి ఆశీస్సుల కోసం తిరుమలకు వచ్చామని నిర్మాత దిల్‌ రాజు వెల్లడించారు.

పవన్‌ కల్యాణ్‌, సుధీర్‌-నానిలతో నిర్మిస్తున్న చిత్ర విశేషాలను మీడియాతో పంచుకున్నారు. నాని, సుధీర్‌బాబు సినిమా మార్చి 25న ఉగాది నాడు విడుదల కాబోతోంది. పింక్‌ సినిమా షూటింగ్‌ కొనసాగుతోంది. పవన్‌ కల్యాణ్ మేలో దర్శనమిస్తారు. మార్చిలో ఫస్ట్‌లుక్‌ .. మేలో ‘పింక్‌’ సినిమా రిలీజ్‌ చేస్తామని దిల్‌ రాజు తెలిపారు.