అండర్‌-19 ప్రపంచకప్‌ ఫైనల్ : భారత్ 25/1 (10 ఓవర్లు)


భారత్‌×బంగ్లాదేశ్‌ మధ్య అండర్‌-19 ప్రపంచకప్‌ ఫైనల్ పోరు జరుగుతోంది. టాస్‌ గెలిచిన బంగ్లాదేశ్‌ బౌలింగ్‌ ఎంచుకుంది. పిచ్‌ బ్యాటింగ్‌కు పూర్తిగా అనుకూలం కాదు. దీంతో యువ భారత్ చాలా నెమ్మదిగా బ్యాటింగ్ చేస్తోంది. 10 ఓవర్లు పూర్తయ్యేసరికి ఒక వికెట్ నష్టానికి యువ భారరత్ 23 పరుగులు మాత్రమే చేసింది.

ప్రస్తుతం క్రీజులో జైశ్వాల్ 14 (35 బంతుల్లో), తిలక్ వర్మ 2 (8బంతుల్లో) ఉన్నారు. ధనాధన్ బ్యాటింగ్ కుదురని పిచ్ పై యువ భారత్ ఆచి తూచి ఆడుతోంది. చివరలో బ్యాట్ ఝులిపించే ప్లాన్ లో యువ భారత ఆటగాళ్లు ఉన్నట్టు కనిపిస్తోంది. ఈ నేపథ్యంలోనే సూపర్ ఫామ్ లో ఉన్న జైశ్వాల్ తన శైలికి భిన్నంగా డిఫెన్స్ ఆడుతున్నాడు.

భారత్‌ : ప్రియమ్‌ గార్గ్‌ (కెప్టెన్‌), యశస్వి జైస్వాల్‌, దివ్యాంశ్‌, తిలక్‌ వర్మ, ధ్రువ్‌ జురెల్‌, సిద్దేశ్‌ వీర్‌, అథర్వ, రవి బిష్ణోయ్‌, శస్వాత్‌, కార్తీక్‌ త్యాగి, ఆకాశ్‌ సింగ్‌

బంగ్లాదేశ్‌: అక్బర్‌ అలీ (కెప్టెన్‌), పర్వేజ్‌, తన్‌జీద్‌, మహ్మదుల్‌ హసన్‌, తౌహిద్‌, షహాదత్‌, అవిషేక్‌ దాస్, షమీమ్‌, రకీబుల్‌, షోరిఫుల్‌ ఇస్లామ్‌, హసన్‌ షకిబ్