కలెక్టర్లకు సీఎం కేసీఆర్ దిశానిర్ధేశం

తెలంగాణ ఎన్నికల హడావుడి ముగిసింది. దీంతో పాలనపై దృష్టి సారించారు సీఎం కేసీఆర్. ఇందులో భాగంగా ఈరోజు ప్రగతి భవన్ లో కలెక్టర్ల సదస్సుని నిర్వహిస్తున్నారు. కొద్దిసేపటి క్రితమే ప్రారంభమైన ఈ సదస్సుకు జిల్లా కలెక్టర్లతో పాటు మంత్రులు, అడిషనల్‌ కలెక్టర్లు, అన్ని శాఖల కార్యదర్శులు హాజరయ్యారు. 

ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. రాష్ట్ర అభివృద్ధి, ప్రజల సంక్షేమం కోసం ప్రభుత్వం రూపొందించిన కార్యక్రమాలను జిల్లా అధికార యంత్రాంగం అమలు చేయాలని ఆదేశించారు. ప్రధానంగా పాలనలో వేగం, ప్రజలకు మరింత చేరువకావడం, ప్రజల వినతులను నిర్ణీత కాలవ్యవధిలో పరిష్కరించడం, ప్రభుత్వ సంక్షేమ, అభివృద్ధి పథకాలను మరింత ప్రభావవంతంగా అమలుచేయడం.. వంటి అంశాలపై సదస్సులో చర్చిస్తున్నారు.

పురపాలక, పంచాయతీరాజ్‌చట్టాల అమలు విషయంలో సీఎం కేసీఆర్ కలెక్టర్లకి పలు సూచనలు చేస్తున్నారు. కొత్త రెవెన్యూచట్టం, భూవివాదాలకు ఫుల్‌స్టాప్‌ పెట్టడానికి తీసుకోవాల్సిన చర్యలపై చర్చిస్తున్నారు. మొత్తంగా.. ప్రభుత్వం తీసుకొచ్చిన పథకాలని కలెక్టర్లు సమర్థవంతంగా అమలు చేయాలని సీఎం కేసీఆర్ కలెక్టర్లని ఆదేశిస్తున్నారు.