అరవింద్‌ కేజ్రీవాల్‌’కు అభినందనల వెల్లువ   

ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో అమ్ ఆద్మీ పార్టీ ఘన విజయం ఖాయమైంది. ఆ పార్టీ 50కి పైగా అసెంబ్లీ స్థానాలని గెలుపొందింది. ఈ నేపథ్యంలో  ఆమ్‌ ఆద్మీ పార్టీ నేతలతో ఆ పార్టీ కన్వీనర్‌, ఢిల్లి ముఖ్యమంత్రి కేజ్రీవాల్‌ సమావేశమయ్యారు. పార్టీ కార్యాలయంలో జరుగుతున్న ఈ సమావేశంలో ఢిల్లి ఎన్నికల ఫలితాలపై వారు చర్చిస్తున్నారు.

మరోవైపు, ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో మరోసారి ఘన విజయం సాధించిన అమ్ ఆద్మీ పార్టీకి శుభాకాంక్షలు వెలువెత్తుతున్నాయి. ఢిల్లి ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ను పశ్చిమ బెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ అభినందించారు. బిజెపిని ప్రజలు తిరస్కరించారని ఆమె అన్నారు. అభివృద్ధి మాత్రమే పని చేస్తుందని ఆమె అన్నారు. సిఎఎ, ఎన్‌ఆర్‌సి, ఎన్‌పిఆర్‌లను తిరస్కరిస్తారని ఆమె చెప్పారు. ఢిల్లి శాసనసభ ఎన్నికల ఫలితాలను తాము అంగీకరిస్తున్నామని బిజెపి ఎంపి గౌతమ్‌ గంభీర్‌ అన్నఆరు. ఆమ్‌ ఆద్మీ పార్టీ (ఆప్‌) నేత, ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌కు గౌతమ్‌ అభినందనలు తెలిపారు.