అమ్ ఆద్మీని గెలిపించింది కాంగ్రెస్ పార్టీనే.. !

వినడానికి కాస్త ఆశ్చర్యంగా అనిపించినా ఇదీ నిజం. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో అమ్ ఆద్మీ పార్టీ విజయం దాదాపు ఖరారైంది. ప్రస్తుత ఎన్నికల రిజల్ట్ ట్రెండ్ ప్రకారం అమ్ ఆద్మీ పార్టీ 53 స్థానాల్లో, భాజాపా 17స్థానాల్లో ఆధిక్యంలో ఉన్నాయి. ఈ నేపథ్యంలో 45 నుంచి 50 మధ్య స్థానాలని గెలుచుకొని అమ్ ఆద్మీ పార్టీ మరోసారి ఢిల్లీలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతుంది. అరవింద్ క్రేజీవాల్ మూడోసారి ఢిల్లీ ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు.

ఢిల్లీలో మరోసారి అమ్ ఆద్మీ పార్టీ విజయం సాధించడం వెనక కాంగ్రెస్ ఉందని విశ్లేషకులు చెబుతున్న మాట. అసలు ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలని కాంగ్రెస్ సీరియస్ గా తీసుకోలేదు. ఎందుకంటే ? కాంగ్రెస్ సీరియస్ గా తీసుకుని ఉంటే.. ఢిల్లీలో భాజాపా అధికారంలోకి వచ్చేది. అలాజరగకూడదని.. కాంగ్రెస్ అమ్ ఆద్మీ పార్టీకి మద్దతిచ్చింది. అలాగని నేరుగా కాదు. పరోక్షంగా. ఎన్నికల ప్రచారాన్ని సీరియస్ గా తీసుకోలేదు. ఆఖరు ఓ వారం రోజుల పాటు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ షో చేశారంతే..!

ఒకవేళ నిజంగా ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలని కాంగ్రెస్ సీరియస్ గా తీసుకొని ఉంటే.. 20 నుంచి 25 శాతం ఓటింగ్ ని ఆ పార్టీ చీల్చేది. అప్పుడు అధికార పార్టీ అమ్ ఆద్మీ ఓట్ బ్యాంక్ కచ్చితంగా చీలేది. దీంతో.. ఈసారి ఢిల్లీ పీఠం భాజాపా వశం అయ్యేది. కాంగ్రెస్ ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలని సీరియస్ గా తీసుకోకపోవడంతో.. ఆ పార్టీ ఓటు బ్యాంకు 2 నుంచి 3 శాతానికి పరితమై.. భాజాపా ఓటమికి కారణమై ఉంటుందని విశ్లేషకులు చెబుతున్నారు. ఇదే నిజం అయితే.. ఢిల్లీలో అమ్ ఆద్మీ గెలుపునకి కాంగ్రెస్ బలమైన కారణమని చెప్పవచ్చు.