ఫిబ్రవరి 14 కేజ్రీవాల్’కు వెరీ స్పెషల్.. !
దేశ రాజధాని ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ ఘన విజయం సాధించింది. అరవింద్ కేజ్రీవాల్ వరుసగా మూడోసారి ఢిల్లీ ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహించనున్నారు. ఫిబ్రవరి 14నే కేజ్రీవాల్ సీఎంగా ప్రమాణస్వీకారం చేసే అవకాశాలు కన్పిస్తున్నాయి. ఫిబ్రవరి14నే ఎందుకు అంటే.. ? ఆ డేటు క్రీజీకి వెరీ స్పెషల్.. ఎందుకంటే ? ఆద్మీ పార్టీ 2002 నవంబర్ లో ఏర్పాటైంది. 2013లో జరిగిన ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో తొలిసారిగా పోటీ చేసింది.
ఆ ఎన్నికల్లో భాజపా 31 స్థానాల్లో గెలిచినప్పటికీ 28 స్థానాల్లో విజయం సాధించిన ఆప్.. కాంగ్రెస్(8)తో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. దీంతో 2013 డిసెంబరులో కేజ్రీవాల్ తొలిసారిగా ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు. ఐతే, ఆ తర్వాత కాంగ్రెస్‌తో విభేదాలు రావడంతో 49 రోజుల తర్వాత 2014 ఫిబ్రవరి 14న కేజ్రీవాల్ సీఎం పదవికి రాజీనామా చేశారు.
రాజీనామా చేసిన ఫిబ్రవరి 14నే మళ్లీ సీఎంగా ప్రమాణ స్వీకారం చేశారు క్రేజీవాల్. అది 2015 ఫిబ్రవరి 14న. ఆ యేడాది జరిగిన ఢిల్లీ ఎన్నికలో ఆప్ ఘన విజయం సాధించింది. ఏకంగా 67స్థానాల్లో జయకేతనం ఎగరవేసింది. “ద్వేషాన్ని ప్రేమతోనే జయించాలి” ఆ సందర్భంగా క్రేజీవాల్ అన్నారు. తాజా ఎన్నికల్లోనూ ఆప్ ఘన విజయం సాధించింది. ఈ నేపథ్యంలో ఈసారి కూడా తనకి అచ్చొచ్చిన ఫిబ్రవరి 14నే ప్రమాణ స్వీకారం చేసేందుకు క్రేజీవాల్ ఏర్పాట్లు చేసుకుంటున్నట్టు తెలుస్తోంది.