మూడో వన్డే : కివీస్ టార్గెట్ 297

న్యూజిలాండ్ ఆఖరి వన్డేలోనూ టీమిండియా నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 296 పరుగులు చేసింది. సూపర్ ఫామ్ ఉన్న కె ఎల్ రాహుల్ (112) సెంచరీ చేశాడు. నెం.4 స్థానాన్ని ఆక్రమించిన యువ ఆటగాడు శ్రేయస్ అయ్యర్ 62 పరుగులతో ఆకట్టుకున్నాడు. మనీష్ పాండే 42, పృధ్వీ షా 40 పరుగులతో రాణించారు.

మొదటి రెండు వన్డేల మాదిరిగానే కెప్టెన్ కోహ్లీతో పాటు టాప్ ఆర్డర్ కుప్పకూలింది. 297 పరుగుల లక్ష్యాన్ని కాపాడుకోవాలంటే టీమిండియా బౌలర్లు తీవ్రంగా శ్రమించాల్సి ఉంటుంది. ఈ మ్యాచ్ కూడా గెలిచేసి.. వన్ డే సిరీస్ లో టీమిండియాని క్లీన్ స్పీప్ చేయాలని… టీ20లో క్లీన్ స్పీప్ కి ప్రతికారం తీర్చుకోవాలని కివీస్ ఆశపడుతోంది.