కోహ్లీసేనకి తప్పని ఘోర అవమానం !
భారతజట్టుపై న్యూజిలాండ్ చాలా త్వరగానే ప్రతీకారం తీర్చుకుంది. న్యూజిలాండ్ పర్యటనని టీమిండియా ఘనంగా మొదలెట్టిన సంగతి తెలిసిందే. ఐదు మ్యాచ్ ల టీ20 సిరీస్ ని టీమిండియా క్లీన్ స్వీప్ చేసింది. న్యూజిలాండ్ కి స్వదేశంలో గుండు కొట్టి తల ఎత్తుకోకుండా చేసింది. ఐతే, ఈ అవమానానికి చాలా త్వరగా ప్రతీకారం తీర్చుకుంది కివీస్ జట్టు.
వన్డే సిరీస్ లో కోహ్లీ సేనని స్పీప్ చేసింది. దాదాపు 31 యేళ్ల తర్వాత టీమ్‌ఇండియా వైట్‌వాష్ అయింది. బలమైన జట్టుగా కొనసాగుతున్న టీమిండియాలోని లోపాలని వెలుగెత్తి చూపింది. మంగళవారం జరిగిన ఆఖరి వన్ డేలో కోహ్లీసేనని 5 వికెట్ల తేడాతో కివీస్ ఓడించింది. మొదటి బ్యాటింగ్ చేసిన టీమిండియా నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 296 పరుగులు చేసింది. కేఎల్ రాహుల్ (112; 113 బంతుల్లో 9×4, 2×6), శ్రేయస్ అయ్యర్ (62; 63 బంతుల్లో 9×4) రాణించారు.
ఛేదనలో మార్టిన్ గప్తిల్ (66; 46 బంతుల్లో 6×4, 4×6), హెన్రీ నికోల్స్ (80; 103 బంతుల్లో 9×4), గ్రాండ్‌హోమ్ (58*; 28 బంతుల్లో 6×4, 3×6) మెరుపులతో కివీస్ అద్భుత విజయం సాధించింది. యుజువేంద్ర చాహల్ (3/47), జడేజా (1/45) మినహా ఎవరూ సత్తా చాటలేదు.