హిట్ అంటే ఏంటీ ? చెప్పేశారుగా.. !

నేచురల్ స్టార్ నాని నిర్మాతగా మారి చేసిన తొలి సినిమా ‘అ!’. అద్భుతమైన సినిమా అనిపించుకుంది. మంచి లాభాలని తెచ్చిపెట్టింది. నాని నిర్మాతగా తెరకెక్కుతోన్న రెండో సినిమా ‘హిట్’. కొలను శైలేష్ దర్శకత్వం వహిస్తున్నారు. ‘ఫలక్‌నుమా దాస్’తో బ్లాక్ బస్టర్ విజయం అందుకున్న మాస్ హీరో విశ్వక్‌సేన్ ఇందులో కథానాయకుడిగా నటించారు. ‘చిలసౌ’ ఫేమ్ రుహానీ శర్మ కథానాయిక.

ఇందులో విశ్వక్ సేన్ ఓ మిస్సింగ్ కేసును విచారణ చేసే అధికారి విక్రమ్ పాత్రలో నటించారు. ఇప్పటికే విడుదలైన టీజర్ కి మంచి స్పందన వచ్చింది. ఐతే, హిట్ అంటే ఏంటీ ? అనే ప్రశ్న అందరినీ తొలిచివేస్తోంది. ఈ నేపథ్యంలో హిట్ అంటే ఏంటీ ? అని చెబుతూ తాజాగా చిత్రబృందం ఓ టీజర్ లాంటిది విడుదల చేశారు. ఇందులో కథానాయకుడు విశ్వక్ సేన్ తో హిట్ అర్థం చెప్పించారు. హిట్ అంటే.. “హోమిసైడ్ ఇంట‌ర్‌వెన్ష‌న్ టీం” అని చెబుతాడు. ఇదొక క్రైమ్ ఇన్వెస్టిగేష‌న్ డిపార్ట్‌మెంట్ అని తెలియ‌జేశాడు విశ్వ‌క్ సేన్‌. ఈ నెల 28న హిట్ ప్రేక్షకుల ముందుకు రానుంది.