వైరల్ : పవన్ చేతిపై ఏపీ సీఎం టాటూ.. !

జనసేన అధినేత, పవర్ స్టార్ పవన్ పవన్ కల్యాణ్ కుడి చేతిపై ‘ఏపీ సీఎం’ టాటూ ఉన్న ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. గత యేడాది జరిగిన ఏపీ అసెంబ్లీ ఎన్నికలకి ముందు పవన్ ఏపీ రాజకీయాల్లో కింగ్ అవుతారని, కింగ్ మేకర్ అవుతారనే ప్రచారం జరిగింది. కానీ, పవన్ కింగ్ కాలేదు. కింగ్ మేకరు కాలేదు. కనీసం పోటీ చేసిన రెండు చోట్ల ఓడిపోయారు.

ఐతే, ఓటమితో కుంగిపోకుండా ప్రజా సమస్యలపై పోరాడుతున్నారు పవన్ కల్యాణ్. సింగిల్ ఎమ్మెల్యే ఉన్నా.. అతడు వైకాపా డప్పు కొడుతున్నా.. పవన్ అదరడం లేదు. బెదరడం లేదు. తనదైన పొలిటికల్ వ్యూహాంతో భాజాపాతో జతకట్టి.. సీఎం జగన్ పై పోరాటానికి రెడీ అవుతున్నారు. ఈ నేపథ్యంలోనే కాబోయే ఏపీ సీఎం తానేననే కోరిక కలిగిందా.. ? అందుకే ఆయన చేతిపై ఏపీ సీఎం అనే టాటూ వేస్తున్నారనే చర్చ జరుగుతోంది. ఐతే, ఆ టాటూ ఫోటోలు నిజం కాదని పవన్ అభిమానులు అంటున్నారు.

ఎవరో మార్పింగ్ చేసి వదిలారని అంటున్నారు. గతంలో జగన్ కి సంబంధించిన మార్పింగ్ ఫోటోలని ఇలానే వదిలారు. ఏపీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు రాకముందే సీఎం జగన్ అనే నేమ్ ప్లేట్ సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఆ తర్వాత నిజంగా జగన్ సీఎం అయ్యారు. మరీ.. ఇప్పుడు పవన్ విషయంలోనూఇదే జరుగుతుందా.. ? భవిష్యత్ ఏపీ సీఎంగా పవన్ అవుతారా ?? అన్నది చూడాలి.