సీఎం జగన్ అంటే.. మోడీకి అంత ఇష్టమా ?


ప్రధాని నరేంద్ర మోడీతో ఓ పది నిమిషాలు సమావేశం కావడమే గొప్ప విషయం. అలాంటిది ఓ రాష్ట్ర ముఖ్యమంత్రికి ప్రధాని ఏకంగా గంటన్నర సమయం ఇచ్చారంటే.. ఎలా అర్థం చేసుకోవాలి. ఆ సీఎం.. ప్రధానికి ఎంతిష్టమో.. ఎంత అవసరమో.. అర్థమవుతోంది. ఆ సీఎం ఎవరో కాదు. ఏపీ సీఎం జగన్. అవునూ.. బుధవారం ఢిల్లీకి వెళ్లిన సీఎం జగన్ ప్రధాని నరేంద్ర మోడీతో సమావేశం అయ్యారు.

ప్రధాని నివాసంలో జరిగిన ఈ సమావేశం సుదీర్ఘంగా గంటన్నర పాటు సాగింది. మొదట ఎంపీలతో కలిసి సమావేశంలో పాల్గొన్న సీఎం జగన్.. ఆ తర్వాత కాసేపు ఏకాంతంగా ప్రధాని మోడీతో చర్చలు జరిపారు. ప్రధానితో రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలతో పాటు రాజకీయపరమైన అంశాలపైనా సీఎం జగన్ చర్చించినట్టు సమాచారం.
 
ముఖ్యంగా ఏపీ అసెంబ్లీ ఆమోదించిన శాసనమండలి రద్దు తీర్మానాన్ని పార్లమెంట్‌లో ఆమోదింపజేయాలని సీఎం జగన్ ప్రధాని మోడీని కోరినట్లు తెలుస్తోంది. అలాగే మూడు రాజధానులకు గ్రీన్ సిగ్నల్ కోరినట్టు వార్తలొస్తున్నాయి. దానికి ప్రధాని నుంచి సానుకూల స్పందన వచ్చినట్టు సమాచారమ్. రాష్ట్రానికి సంబంధించిన కేటాయింపులతో పాటు రెవెన్యూ లోటుకు సంబంధించిన అంశాలను ప్రధానంగా చర్చించినట్లు సమాచారమ్.

ఇక ఏపీ విషయంలో కేంద్రం వైఖరీ విచిత్రంగా ఉంది. ఏపీ సీఎం జగన్ కి భాజాపా ముందు నుంచి మద్దతుగా నిలుస్తోంది. ఆయనకి అవసరమైన సహాయ-సహకారాలు అందించి తెదేపాని చావు దెబ్బ కొట్టింది. ఇప్పుడు జనసేన అధినేతతో కలిసింది. బహుశా.. భాజాపా నెక్ట్స్ టార్గెట్ సీఎం జగన్ నే కావొచ్చు. పవన్ ని వినియోగించుకొని.. జగన్ ఓడించాలన్నది భాజాపా ప్లాన్ లా కనిపిస్తోంది. మరీ.. జగన్ ని ఢీకొనడం పవన్  కి సాధ్యమా ? దానికి సమాధానం భవిష్యత్ నే చెప్పాలి.