క్లీన్ స్వీప్ ఎఫెక్ట్ : ఆ నలుగురిపై వేటు
కివీస్ పర్యటనలో కోహ్లీ సేనకి గుండు గీయించుకున్న సంగతి తెలిసిందే. టీ20 సిరీస్ లో కివీస్ కి టీమిండియా గుండు కొట్టింది. ఇక వన్ డే సిరీస్ లో కివీస్ చేత టీమిండియా గుండు కొట్టించుకుంది. ఈ నేపథ్యంలో.. ఇప్పటికే ఎంపికైన టెస్టు జట్టులో నలుగురిపై వేటుపడే అవకాశాలు కనిపిస్తున్నాయి. మయాంక్ అగర్వాల్, పృద్వీ షా, బూమ్రాలతో పాటు రిషభ్ పంత్ ని పక్కనపెట్టే అవకాశాలున్నాయని తెలుస్తోంది. మరీ.. వీరిస్థానంలో ఎవరిని తీసుకుంటారన్నది చూడాలి.
ఇక వన్ డే సిరీస్ లో టీమిండియా క్లీన్ స్వీప్ కావడానికి ప్రధాన కారణం.. ఓపెనింగ్ జంట రోహిత్, ధావన్ లేకపోవడం, కోహ్లీ మూడు మ్యాచ్ లలోనూ విఫలమవ్వడమని చెప్పవచ్చు. ఈ సిరీస్ లో బుమ్రా ఒక్క వికెట్ కూడా తీయలేదు. పవర్ ఫుల్ బౌలర్ సడెన్ గా సాదాసీదా బౌలర్ గా మారిపోయాడు. ఫీల్డింగ్ లోనూ తప్పిదాలు టీమిండియా గెలుపు అవకాశాలని దెబ్బతీశాయి. వీటి నుంచి పాఠం నేర్చుకొని టెస్ట్ సిరీస్ కి రెడీ అవుతోంది.. టీమిండియా.
టెస్ట్ జట్టు : విరాట్ కోహ్లీ(కెప్టెన్), మయాంక్ అగర్వాల్, పృథ్వీ షా, శుభ్మన్ గిల్, పుజారా, అజింక్య రహానే, హనుమ విహారి, సాహా, రిషబ్ పంత్, అశ్విన్, రవీంద్ర జడేజా, జస్ప్రీత్ బుమ్రా, ఉమేష్ యాదవ్, షమీ, సైనీ, ఇషాంత్ శర్మ( నో క్లారిటీ)