శ్రీరెడ్డిని డిన్నర్’కి పిలిచిన డ్యాన్స్ మాస్టర్.. ఏం చేశాడంటే.. ?


వివాదాస్పద నటి శ్రీరెడ్డి బారినపడిన వారి లిస్టు పెద్దదే. వాళ్లు, వీళ్లు తనని పడకగదికి పిలిచారు. అక్కడికి రమ్మన్నారు. ఇక్కడికి రమన్నారు. ఇలా చేశారు. ఇవి చూపించమన్నారు. అవి చూపించమన్నారు. తనని వాడుకొన్నారు. తనని మోసం చేశారని శ్రీరెడ్డి ఆరోపిస్తుంటుంది. ఐతే, వాటికి సంబంధించిన రుజువులని మాత్రం చూపించడం లేదు.

ఈ క్రమంలో శ్రీరెడ్డి డ్యాన్సర్ మాస్టర్ రాకేశ్ పై తీవ్ర ఆరోపణలు చేసిండి. ఇటీవలే రాకేష్ మాస్టర్ తనను డిన్నర్‌కి పిలిచాడని సంచలన కామెంట్ చేసింది శ్రీ రెడ్డి. తాజాగా ఈ వ్యవహారంపై రాకేష్ రెడ్డి స్పందించారు. ఆ రోజు శ్రీరెడ్డి అర్ధనగ్నంగా రోడ్డుమీద ఉంటే.. ఆడపిల్ల కదా అనే సిపంథీతో ఫోన్ చేసి మాట్లాడాను.

కానీ ఆమె మాత్రం నన్ను డిన్నర్‌కి పిలిచారు అంటూ ఏవేవో చెప్పి.. నన్ను వివాదంలోకి లాగే ప్రయత్నం చేసింది. ఒకవేళ నేను ఆమెతో వల్గర్‌గా మాట్లాడి ఉంటే ఆ ఆడియో లీక్ చేయొచ్చు కదా అన్నారు. బరితెగించి ఒళ్లంతా తిప్పుతూ ఫేస్‌బుక్‌లో ఎంతమందిపై ఇలా అబాండాలు మోపుతుంది. ఆమెని వదిలే ప్రసక్తే లేదు. ఏ టీవీ ఛానల్ కి ఐనా రా.. చర్చకు సిద్ధం అన్నారు రాకేష్ మాస్టర్.