రిటైర్డ్‌మెంట్’పై వివరణ ఇచ్చిన సమంత
స్టార్ హీరోయిన్ సమంత తల్లి కావాలని ఆశపడుతోంది. ఈ నేపథ్యంలో ఆమె త్వరలోనే సినిమాలకి దూరం కానుందనే ప్రచారం చాన్నాళ్లుగా జరుగుతోంది. అది నిజమే అన్నట్టుగా ఇటీవల ‘జాను’ సినిమా ప్రమోషన్స్ లో పాల్గొన్న సమంత.. మహా అయితే.. మరో మూడేళ్లపాటు నటిగా కొనసాగుతానేమోనని తెలిపింది. దీంతో.. మూడేళ్ల తర్వాత సామ్ తల్లికాబోతుంది. సినిమాలకి దూరం కాబోతుందనే చెప్పుకొంటున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా రిటైర్డ్‌మెంట్ సామ్ వివరణ ఇచ్చింది.
తన మాటలని మీడియా తప్పుగా అర్థం చేసుకుంది. రెండు, మూడేళ్లలో రిటైర్ అవుతానని ఎక్కడా చెప్పలేదు. పదేళ్లకు పైగా నటిగా కొనసాగుతున్నానని, సవాల్‌తో కూడుకున్న సినీ పరిశ్రమలో ఇమడటం అంత ఈజీ కాదని మాత్రమే చెప్పా. నటిగా కొనసాగలేకపోతే.. ఇదే రంగంలో మరో విధంగా పనిచేస్తానని, ఈ క్రమంలో కొంచెం గ్యాప్స్ రావొచ్చని చెప్పాను. అంతే తప్ప సినిమాలకు దూరమవుతానని చెప్పలేదని సమంత వివరణ ఇచ్చింది. సమంత వివరణతో ఆమె అభిమానులు ఖుషి అవుతున్నారు.
ఇక గతవారం ప్రేక్షకుల ముందుకొచ్చిన ‘జాను’ పాజిటివ్ టాక్ సొంతం చేసుకొంది. తమిళ్ 96 మేజిక్ రిపీట్ చేసిందని చెప్పుకొంటున్నారు. జానుగా సమంత, రామ్ గా శర్వానంద్ నటన అద్భుతం అంటున్నారు. ఐతే, జాను కలెక్షన్స్ మాత్రం బ్లాక్ బస్టర్ హిట్ రేంజ్ లో లేవని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి.