అడ్డంగా దొరికిపోయిన సారా

బాలీవుడ్ స్టార్ సైఫ్ అలీఖాన్ ముద్దుల కూతురు, యంగ్ హీరోయిన్ సారా అలీఖాన్ యంగ్ హీరో కార్తీక్ ఆర్యన్ తో డేటింగ్ లో ఉంది. వీరిద్దరు పార్టీ, పబ్ లు అంటూ షికారు చేస్తున్నారనే ప్రచారం జరుగుతోన్న సంగతి తెలిసిందే. మీడియాలో వస్తున్న వార్తలపై సారా రెండు మూడు సార్లు వివరణ ఇచ్చింది. మీడియాలో వస్తున్న వార్తలు పూర్తిగా అవాస్తవం అని.. తామిద్దరం మంచి స్నేహితులం మాత్రమే అంటూ చెప్పుకొచ్చింది.

అంతేకాదు.. ఈ గాసిప్ ని సినిమా ప్రమోషన్స్ కోసం వినియోగించుకుంటున్నారు. వీరు కావాలని ప్రమోషన్ కోసం అనుమానం వచ్చే వీడియోలు మరియు పోస్ట్ లు పెడుతున్నారు. తాజాగా హీరో కార్తీక్ ఆర్యన్ ఇన్ స్టాగ్రామ్ లో సారాతో కలిసి బైక్ పై వెళ్తున్న చిన్న వీడియోను పోస్ట్ చేశాడు. వీరిద్దరు జంటగా నటించిన లవ్ ఆజ్  కల్ ఈ నెల 14న ప్రేక్షకుల ముందుకు రానుంది.

View this post on Instagram

Challan Katega Aur mera bhi ….

A post shared by KARTIK AARYAN (@kartikaaryan) on