సర్పకన్యలా బాలీవుడ్ హీరోయిన్


బాలీవుడ్ హీరోయిన్ వాణీ కపూర్ సర్పకన్యలా మారిపోయింది. హాట్ హాట్ ఫోటో షూట్స్ తో సెగలు రేపడం వాణీకపూర్ కి అలవాటే. తాజాగా ఆమె ట్రావెల్ అండ్ లీజర్ ఇండియా మ్యాగజైన్ కవర్ పేజ్ కోసం ఫోటో షూట్ చేసింది. అల్ట్రా స్టైలిష్ డిజైనర్ లుక్ లో థై స్లిట్ డిజైన్ లో మతులు చెదరగొట్టింది. సిల్వర్ తళుకులతో వాణీ సర్పకన్యనే తలపిస్తోంది.

ఇక త్వరలోనే వాణీకపూర్ తెలుగు తెరకు పరిచయం కాబోతున్నట్టు సమాచారమ్. క్రిష్ దర్శకత్వంలో పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా కోసం ఆల్రెడీ తెలుగులో సినిమాలు చేసిన బాలీవుడ్ హీరోయిన్ కైరా అద్వానీ కోసం ప్రయత్నించారు. కానీ, ఆమె బిజీగా ఉండటం కారణంగా పవన్ సినిమాకి నో చెప్పింది. దీంతో వాణీ కపూర్ ని తీసుకోవాలని.. ఈ మేరకు సంప్రదింపులు జరుగుతున్నట్టు సమాచారమ్.