విజయ్ దేవరకొండ పెళ్లి ప్రకటన
టాలీవుడ్ సంచలనం విజయ్ దేవరకొండ పెళ్లి ప్రకటన చేశారు. పెళ్లి చూపులు, అర్జున్ రెడ్డి, గీత గోవిందం సినిమాలతో విజయ్ దేవరకొండ టాలీవుడ్ స్టార్ హీరోల లిస్టులో చేరిపోయాడు. కాదు.. స్టార్ హీరోలని మించిపోయాడు. విజయ్ సినిమా వస్తుందంటే.. అదో సంచలనంగా మారింది. అంతలా యువని ఆకట్టుకుంటున్న కథానాయకుడు విజయ్ దేవరకొండ. ఫ్యామిలీ, మహిళా అభిమానుల మద్దతు విజయ్ కి ఉంది.
ప్రస్తుతం ఆయన కథానాయకుడిగా నటించిన చిత్రం ‘వరల్డ్ ఫేమస్ లవర్’. క్రాంతి మాధవ్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో విజయ్ దేవరకొండ సరసన రాశీఖన్నా, ఐశ్వర్య రాజేశ్, ఇజబెల్లె లైట్, కేథరిన్ కనిపించనున్నారు. ప్రేమికుల దినోత్సవాన్ని పురస్కరించుకుని ఫిబ్రవరి 14న ఈసినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో తాజాగా ‘వరల్డ్ ఫేమస్ లవర్’ ప్రమోషన్స్‌లో విజయ్ దేవరకొండ పాల్గొన్నారు. ఇందులో భాగంగా పెళ్లి ప్లాన్స్ గురించి విజయ్ స్పందించారు.
“వివాహబంధంపై నాకెంతో గౌరవం ఉంది. కానీ ప్రస్తుతానికి మాత్రం అందుకు నేను సిద్ధంగా లేనని అనుకుంటున్నాను. ఎందుకంటే ఇప్పుడు నా కెరీర్‌ను ప్రేమిస్తున్నాను. జీవితంలో ఎన్నో సాధించాలనుకుంటున్నాను” అని విజయ్ దేవరకొండ తెలిపారు. ఇక ఇప్పటి వరకు ఏ హీరోయిన్ తో విజయ్ కి లింకు పెట్టి ప్రచారం జరగలేదు. కానీ, విజయ్ అంటే బాలీవుడ్ యంగ్ హీరోయిన్ జాన్వీకపూర్ పడిచస్తోంది. ఒకట్రెండు ఇంటర్వ్యూలో విజయ్ అంటే ఇష్టమని ఓపెన్ అయింది. ఐతే, విజయ్ నుంచి ఎలాంటి స్పందన లేదని కూడా తెలిపింది. విజయ్ ఓకే అంటే… జాన్వీ కపూర్ రెడీ.. డేటింగ్ చేయడానికి.. !