లైవ్ : ‘వరల్డ్ ఫేమస్ లవ్వర్’ గ్రాండ్ రిలీజ్ ఈవెంట్

‘వరల్డ్ ఫేమస్ లవ్వర్’గా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు టాలీవుడ్ సంచలనం విజయ్ దేవరకొండ. క్రాంతి మాధవ్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రమిది. రాశీ ఖన్నా, ఐశ్వర్యా రాజేష్, కేథరిన్ ట్రెసా, ఇజాబెల్లే హీరోయిన్లుగా నటించారు. ప్రపంచ ప్రేమికుల దినోత్సవం కానుకగా ఫిబ్రవరి 14న ప్రేక్షకుల ముందుకు రానుంది. 

ఈ నేపథ్యంలో సినిమా ప్రమోషన్స్ ని పీక్స్ కి తీసుకెళ్లే పనిలో చిత్రబృందం ఉంది. ఇందులో భాగంగా తాజాగా వైజాగ్ లో గ్రాండ్ రిలీజ్ ఈవెంట్ ని నిర్వహిస్తోంది. ఈ వేదికగా సినిమా విశేషాలని చిత్రబృందం ప్రేక్షకులతో పంచుకోనుంది. ప్రేమకథల్లో ఇదో డిఫరెంట్ ప్రేమకథ. ఇందులో ఓ సప్రైజ్ ఉంటుందని చిత్రబృందం చెబుతోంది. ఇక వరల్డ్ ఫేమస్ లవ్వర్ గ్రాండ్ రిలీజ్ ఈవెంట్ ని మీరు లైవ్ లో చూసేయండీ.. !