‘వరల్డ్ ఫేమస్ లవ్వర్’.. ఓ సప్రైజ్ !

టాలీవుడ్ సంచలనం విజయ్ దేవరకొండ తాజా చిత్రం ‘వరల్డ్ ఫేమస్ లవ్వర్’. క్రాంతి మాధవ్ దర్శాకత్వం వహించారు. విజయ్ సరసన రాశీ ఖన్నా, ఐశ్వర్యా రాజేష్, కేథరిన్ ట్రెసా, ఇజాబెల్లే హీరోయిన్లుగా నటించారు. వేలంటైన్స్ డే కానుకగా పిబ్రవరి 14న వరల్డ్ ఫేమస్ లవ్వర్ ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఈ సినిమా టీజర్, ట్రైలర్ లలో రొమాన్స్ హైలైట్ గా నిలిచింది. ముద్దుసీన్లని చూసి.. ఇదో మరో అర్జున్ రెడ్డి అని చెప్పుకొంటున్నారు. ఐతే, వారందరికీ ఇదొక సర్‌ప్రైజ్‌లా ఉండబోతుందని అంటున్నారా రాశీఖన్నా. ఈ సినిమా ప్రమోషన్స్ లో పాల్గొన్న రాశీఖన్నా.. నేను ఇప్పటి వరకు చేసిన చిత్రాలతో పోలిస్తే ఒక డిఫరెంట్ క్యారెక్టర్ చేశాను. ఆ విషయం ఇప్పటికే ట్రైలర్ చూసిన ప్రతి ఒక్కరికి అర్ధం అయి ఉంటుంది.

నా క్యారెక్టర్ గురించి చెప్పాలంటే ఈ సినిమా కథ గురించి చెప్పాలి. అందుకే ఇది ఒక ఛాలెంజింగ్ క్యారెక్టర్ అని మాత్రమే ఇప్పుడు చెప్పగలను. అలాగే టీజర్‌, ట్రైలర్ చూసి ఈ సినిమా కథ ఇది అయి ఉండొచ్చు అని చాలా రకాలుగా అనుకుంటున్నారు. అలాంటి వారందరికీ ఇదొక సర్‌ప్రైజ్‌లా ఉండబోతుందని చెప్పుకొచ్చారు. ఇక ఈ సినిమా రాశీ సెమీ న్యూడ్ గా కనిపించబోతుంది. ఆ బిట్ సీన్ ని ట్రైలర్ లోనే చూపించారు. సినిమాలో ఆ సీన్ ని ప్రేక్షకులు ఆస్వాదించబోతున్నారు.