టాలీవుడ్ కి దొరికిన మరో సమంత 


గతకొంతకాలం క్రితం టాలీవుడ్ నటి స్నేహా ఉల్లాల్ ని  చూసి చాలామంది జూనియర్ ఐశ్వర్యరాయ్ అన్నారు. అయితే ఆమె ఐష్ స్థాయికి చేరుకోలేకపోయింది. ‘కృష్ణగాడి వీర ప్రేమగాధ’ సినిమాతో మెహ్రీన్ హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చినప్పుడు.. ఆమెలో కాజల్ కనిపిస్తుందని చెప్పుకొన్నారు. ఓ యాంగిల్ మెహ్రీన్ కాజల్ లా కనిపిస్తుందని చెప్పుకొన్నారు.

ఇక ఎనర్జిటిక్ హీరో రామ్ ‘రెడ్’ చిత్రంలో అమ్రిత అయ్యర్ హీరోయిన్ గా నటిస్తోంది. ఆమె ఫస్ట్ లుక్ ఇటీవలే విడుదలైంది. ఆమెకు సమంతతో పోలికలు ఉన్నట్టు సోషల్ మీడియాలో కామెంట్స్ వినిపించాయ్. తాజాగా కోలీవుడ్ నటి ఆత్మికాకు సంబంధించిన ఫొటోలు చూసి చాలా మంది ఆశ్చర్యానికి గురి అవుతున్నారు. ఎందుకంటే ఆమె అచ్చం సమంతలాగా ఉంది. సినిమాల్లోకి వచ్చిన కొత్తలో సమంత ఎలా ఉండేవారో అచ్చం అలాగే కనిపిస్తూ నెటిజన్లను మురిపిస్తోంది.