బాలీవుడ్ లో సినిమా చేస్తా : బన్నీ 

స్టయిలీష్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం ‘అల.. వైకుంఠపురంలో’ హిట్ కిక్కులో ఉన్నారు. త్రివిక్రమ్-అల్లు అర్జున్ కాంబోలో వచ్చిన హ్యాట్రిక్ సినిమా ఇది. సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకొచ్చిన అల.. బ్లాక్ బస్టర్ హిట్ అయింది. సంక్రాంతి విజేతగా నిలిచింది. ఏకంగా రూ. 200కోట్లకిపైగా వసూలు చేసింది. కొన్ని చోట్ల నాన్ బాహుబలి రికార్డులని క్రాస్ చేసింది.

ఈ నేపథ్యంలో అల.. చిత్రబృందం సక్సెస్ ని ఆస్వాదించింది. పలు సక్సెస్ మీట్ లని నిర్వహించింది. బన్నీ, త్రివిక్రమ్ మీడియాకు స్పెషల్ ఇంటర్వ్యూలు ఇచ్చారు. తాజాగా ఓ ఛానెల్ నిర్వహించిన ఇంటర్వ్యూలో అల్లు అర్జున్ అనేక ఆసక్తికర విశేషాలు పంచుకున్నారు. ప్రస్తుతం మేము ఏవైతే విలువలు పాటిస్తున్నామో అవన్నీ మాకు చిరంజీవి నుంచి వచ్చినవే. ఆయన ఎన్నో ఇబ్బందులు, ఒడిదొడుకులు ఎదుర్కొని ఈ స్థాయికి వచ్చారు. అందుకే మా కుటుంబంలోని హీరోలతో పాటు మరెందరికో ఆయన ఎంతో స్ఫూర్తిదాయకంగా నిలిచారని చెప్పుకొచ్చారు.

బాలీవుడ్ సినిమాల్లో నటించడంపై బన్నీ క్లారిటీ ఇచ్చారు. మంచి కథ వస్తే తప్పకుండా బాలీవుడ్ సినిమాలో నటిస్తాను. భారతీయ చిత్ర పరిశ్రమకు బాలీవుడ్ పెద్దన్నలాంటిది. దేశంలోని చాలా చిత్ర పరిశ్రమలు బాలీవుడ్ నుంచి స్ఫూర్తి పొందాయని తెలిపారు.