బ్రహ్మచారులని భలే వాడేశాడుగా.. !


మెగా యంగ్ హీరో సాయితేజ్ సింగిల్ లైఫ్ నే బెటర్ అంటున్నారు. ఆయన తాజా చిత్రం ‘సోలో బతుకే సో బెటర్’. ఈ సినిమాకు సుబ్బు అనే నూతన దర్శకుడు దర్శకత్వం వహిస్తున్నాడు. నభా నటాషా కథానాయిక. బీవీఎస్ ఎన్ ప్రసాద్ నిర్మాత. మే1న ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రేమికుల దినోత్సవం (ఫిబ్రవరి 14) రోజున సింగిల్స్ ని ఏకం చేయాలని తేజు ఫిక్సయ్యాడు. సింగిల్స్ నాయకత్వం వహించనున్నాడు. తాజాగా ఈ సినిమా థీమ్ సాంగ్ ని సంగీత దర్శకుడు థమన్ విడుదల చేశారు.

“కోపం, ఇష్టం, విచారం, సంతోషం.. కాలంతో పాటు, కారణాలతో పాటు మారిపోయే ఫీలింగ్స్. అలాగే ప్రేమ అనేది కూడా ఓ ఫిలింగే కదా. మారదని గ్యారేంటీ ఏంటీ ? మన గోల్ ఏంటీ ? మన అజెండా ఏంటీ ?? మన స్లోగన్ ఏంటీ ? సోలో బతుకే సో బెటర్” అంటూ స్పీచ్ ఇచ్చాడు తేజు. అంతేకాదు.. సింగిల్స్ ని ఆదర్శంగా స్టేజ్ పై బ్రహ్మచారులు లతా మంగేష్కర్, వాజ్ పేయి, ఆర్ నారాయణ మూర్తి, అబ్దుల్ కలాం ఫోటోలని ఉంచారు. వారి ఆశీస్సులు తీసుకొనే.. సింగిల్స్ కి నాయకత్వం వహించాడు తేజు. వారిలో స్పూర్తిని నింపే స్పీచ్ ఇచ్చారు.