రౌడీ హీరోకు.. స్టార్స్ సపోర్ట్ అదిరింది ! 


అందరి హీరోలకి అభిమానులుంటారు. కానీ, అందరి హీరోల అభిమానులు విక్టరీ వెంకటేష్ కు అభిమానులు. ఇప్పుడు టాలీవుడ్ సంచలనం విజయ్ దేవరకొండ విషయంలోనూ అదే కనిపిస్తోంది. ఆయనకి అందరు హీరోల ఫ్యాన్స్ నుంచి ఫుల్ సపోర్ట్ లభిస్తోంది. విజయ్ తాజా చిత్రం వరల్డ్ ఫేమస్ లవ్వర్. ప్రపంచ ప్రేమికుల దినోత్సవం కానుకగా ఈరోజు ప్రేక్షకుల ముందుకొచ్చింది.

అయితే, వరల్డ్ ఫేమస్ లవ్వర్  కి టాలీవుడ్ స్టార్స్ మహేష్, ప్రభాస్, ఎన్ టీఆర్, అల్లు అర్జున్, నాని.. ఇలా అందరు సపోర్ట్ చేస్తున్నారు. సినిమా బ్లాక్ బస్టర్ హిట్ కావాలని ఆకాంక్షిస్తూ ట్విట్ చేస్తున్నారు. అంతేకాదు.. వరల్డ్ ఫేమస్ లవ్వర్ కి పొలిటికల్ సపోర్ట్ కూడా ఉంది. టీఆర్ఎస్ శ్రేణులు, సీఎం కేసీఆర్ అభిమానులు విజయ్ ని సపోర్ట్ చేస్తున్నారు. 

ఇక  వరల్డ్ ఫేమస్ లవ్వర్ పై పాజిటివ్ టాక్ వినిపిస్తోంది. విజయ్ మరోసారి భారీ సిక్సర్ కొట్టేశాడు. బంతి ఏకంగా స్టేడియం బయటే పడిందని చెబుతున్నారు. ఈ చిత్రానికి క్రాంతి మాధవ్ దర్శకత్వం వహించారు. రాశీ ఖన్నా, ఐశ్వర్యా రాజేష్, కేథరిన్ ట్రెసా, ఇజాబెల్లే హీరోయిన్లు. ఈ నలుగురితో విజయ్ చేసిన రొమాన్స్, వారితో ఏర్పడిన ఎమోషన్స్ బాగా పడ్డాయని చెబుతున్నారు.