సితార పాప తమన్నాతో పోటీ

సూపర్‌స్టార్‌ మహేశ్‌ బాబు కుమార్తె సితార మిల్కీ బ్యూటీ తమన్నాతో పోటీపడింది. అనిల్‌ రావిపూడి దర్శకత్వంలో సూపర్ స్టార్  మహేష్ బాబు నటించిఅన్ చిత్రం ‘సరిలేరు నీకెవ్వరు’. సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకొచ్చి బ్లాక్ బస్టర్ హిట్టయింది. ఇందులో మహేశ్‌ ఆర్మీ ఆఫీసర్‌గా కనిపించారు. ఈ సినిమాలో తమన్నా ‘డాంగ్‌ డాంగ్‌’ అనే పార్టీ సాంగ్‌కు తనదైన శైలిలో డ్యాన్స్‌ చేసి ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్న విషయం తెలిసిందే.

ఇప్పుడీ పాటకి సితార పాప అదరగొట్టేలా స్టెప్పులు వేసింది. దీనికి సంబంధించిన వీడియోను నమ్రత ఇన్‌స్టా వేదికగా షేర్‌ చేసింది. ఇందులో సితార మిల్కీబ్యూటీ తమన్నాను బీట్‌ చేసేలా స్టెప్పులేశారు. ఇక ఇప్పటికే  సితార పాప సోషల్ మీడియా స్టార్. వంశీ పైడిపల్లి కుమార్తె ఆద్యాతో కలిసి సితార ‘A&S’ పేరుతో ఓ యూట్యూబ్‌ ఛానల్‌ను నిర్వహిస్తోంది. అంతేకాదు.. సితార చిలిపి వీడియోలని మహేష్ ట్విట్టర్ లో అభిమానులతో పంచుకుంటారు. అవి వైరల్ అవుతుంటాయ్. ఈసారి సితార పాప ఏకంగా తమన్నాకి పోటీ ఇచ్చే విధంగా డాంగ్ డాంగ్ సాంగ్ కి చిందులేసింది.