వరల్డ్ ఫేమస్ లవ్వర్ ఎఫెక్ట్.. పార్కులు ఖాళీ !
నేడు ప్రపంచ ప్రేమికుల దినోత్సవం. ఈరోజున ప్రేమ పక్షులతో పార్కులు కళకళాడుతుంటాయి. కానీ, హైదరాబాద్ లో పార్కులు ఖాళీగా కనిపిస్తున్నాయి. దీనికి కారణం.. ఈరోజు పార్కుల్లో జంటగా కనిపిస్తే.. పెళ్లి చేస్తామని భజరంగ్ దళ్ వార్నింగ్ ఇవ్వడమే. మరో కారణం కూడా ఉంది. అదే వరల్డ్ ఫేమస్ లవ్వర్ రిలీజ్. పార్కులకి వెళ్లి ఇబ్బందులు పడటం కన్నా.. హాయిగా థియేటర్ కి వెళ్లి సినిమా చూడొచ్చని.. అది కూడా విజయ్ దేవరకొండ సినిమా. ‘వరల్డ్ ఫేమస్ లవ్వర్’గా వచ్చాడు. చూసేద్దామని ప్రేమపక్షలు థియేటర్స్ వైపు వెళ్తున్నారు. దాంతో హైదరాబాద్ లో పార్కులు ఖాళీగా కనిపిస్తున్నాయి.
ఈ చిత్రానికి క్రాంతి మాధవ్ దర్శకత్వం వహించారు. రాశీ ఖన్నా, ఐశ్వర్యా రాజేష్, కేథరిన్ ట్రెసా, ఇజాబెల్లే హీరోయిన్లు. ఈ సినిమాలో రొమాన్స్ ఒక్కటే కాదు.. ఓ సప్రైజ్ ఉందని చిత్రబృందం మొదటి నుంచి చెబుతోంది. ఆ సప్రైజ్ ఏంటన్నది తెలియాలంటే.. సినిమా చూడాల్సిందే. ఇక వరల్డ్ ఫేమస్ లవ్వర్ పై పాజిటివ్ టాక్ వినిపిస్తోంది.